Image result for charmi in high court of hyderabad & images of high court



కొంత సేపటి క్రితమే చార్మి వేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం (మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు) తీర్పు వెలువరించింది.  డ్రగ్స్‌ కేసులో హైకోర్టును ఆశ్రయించిన సినిమా హీరోయిన్‌ చార్మి పై జనం లో కొంత విశ్వాసం తగ్గినా విచారణ విషయములో మాత్రం స్వల్ప ఊరట లభించింది. సిట్‌ మహిళా అధికారులు ఆమెను ఉదయం "10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు" మాత్రమే విచారించాలని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. 


అలాగే సిట్ ను, ఆమె అనుమతి లేకుండా రక్త నమూనా తీసుకోవద్దని ఆదేశించింది. చార్మికి ఇష్టమైన స్థలంలోనే విచారణ జరపాలని సూచించింది. వ్యక్తిగత లాయర్‌ సమక్షంలోనే విచారణ జరపాలన్న విజ్ఞప్తిని చార్మి న్యాయస్థానం పూర్తిగా తిరస్కరించింది.


తాము లేవనెత్తిన అంశాలపై గౌరవ న్యాయస్థానం మూడు కీలక ఆదేశాలిచ్చిందని చార్మీ తరపు న్యాయవాది విష్ణువర్థన్‌రెడ్డి తెలిపారు. 


Image result for charmi in high court of hyderabad & images of high court


1.విచారణకు వెళ్లాలా, వద్దా అనేది ఆమె ఇష్టమని 
2.ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా శాంపిల్స్‌ తీసుకోవద్దని కోర్టు ఆదేశించిందని వెల్లడించారు. 
3.రేపు ఎక్కడ విచారణకు హాజరవుతారనే విషయం పై ఈ సాయంత్రం ఆమె నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.


డ్రగ్స్‌ కేసులో చార్మి నిందితురాలు కాదని, సాక్షి అని తెలిపారు. ఈ విషయాన్ని సమన్లలో స్పష్టంగా పేర్కొన్నారని విచారణ కోసం నాంపల్లి లోని ఎక్సైజ్ కార్యాలయానికి వెళ్లాలని చార్మిని తాను సూచిస్తానని చెప్పారు. ప్రైవేటు స్థలాల్లో అయితే భద్రతా పరమైన ఇబ్బందులు ఉంటాయని అభిప్రాయపడ్డారు. న్యాయస్థానానికి పిర్యాదు చేయటం వలన చార్మీకి పబ్లిసిటి మాత్రమే మిగిలింది. చెప్పుకోదగ్గ ప్రయోజనాలు లభించలేదు కొంత ఊరట తప్ప. 


అయినా  సాక్ష్యానికే ఇంత కంగారు పదితే ఎలా? ఈ విషయం పై లోతుగా విచారణ జరిపితే ఇంకా ఎలా ఉంటుందో? కోర్టుకు వెళ్లి,  పరోక్షంగా చార్మి నిందితురాలని తానే ఒప్పుకున్నట్టుగా ఉంది. 


Image result for high court of ap telangana

మరింత సమాచారం తెలుసుకోండి: