ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వానికీ - ముద్రగడ పద్మనాభానికీ మధ్యన సయోధ్య కుదరడం లేదు. కాపు రిజర్వేషన్ కి సంబంధించి తాము ఉద్యమం - పాదయాత్ర చేసి తీరతాము అని ఆయన పట్టు పడుతూ ఉండగా మరొక పక్క ఆయన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు విసృతంగా ఆయన ఊళ్ళో కొలువు దీరారు. మొత్తం మీద చలో అమరావతి కోసం ప్రకటించిన జూలై 26 రానే వచ్చింది, మూడు రోజుల ముందర నుంచే ముద్రగడ పద్మనాభం జిల్లాతో పాటు పలు ప్రాంతాలలో పోలీసులు బందో బస్తీ ఉన్నారు. ఆయనకి సపోర్ట్ గా వచ్చే వేలాది మందిని అడ్డుకుంటూ ఉన్నారు కూడా.


ఇవాళ కొద్ది సేపటి క్రితం పాదయాత్ర కోసం తన ఇంట్లోంచి బయటకి రావడం కోసం ప్రయత్నం చేసిన ముద్రగడ ని కనీసం ఇంటి గేటు కూడా దాటనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ముద్రగడ, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. తనను పాదయాత్రకు వెళ్లనివ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. పోలీసులు మాత్రం, ర్యాలీకి, పాదయాత్రలకు ఈ ప్రాంతంలో అనుమతులు లేనందున, బయటకు అడుగుపెట్టనివ్వబోమని స్పష్టం చేస్తున్న పరిస్థితి.



 ఆయనకి మద్దతుగా వేలాదిమంది కిర్లంపూడి లో కనపడ్డారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.ముద్రగడ తమ మాట వినకపోతే అరస్ట్ చేసి సేఫ్ గా కాకినాడ లాంటి ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తారు పోలీసులు. దాదాపు వరం నుంచీ కిర్లంపూడి, అమలాపురం ప్రాంతాల్లో గట్టి బందోబస్తును నిర్వహిస్తూ, అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నారు వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: