ఆ మద్య ఓ సినిమాలో గుడిముందు బిక్షమెత్తుకునే బిచ్చగాడు..ఇండియా అభివృద్ది కాలేకపోవడానికి కారణం..నల్లధనం అంటాడు.  ఈ నల్లధనాని కారణం పెద్ద నోట్లు..ఒక సూట్కేస్ లో వెయ్యి,ఐదు వందల నోట్లు ఎక్కువ పెట్టుకొని దాన్ని ఎక్కడైనా దాచవచ్చని..అదే యాభై, వంద రూపాయలు ఎక్కువగా దాచుకోలేరని అందుకే పెద్ద నోట్ల స్థానంలో చిన్న నోట్లు రావాలని అప్పుడే డబ్బు దొంగతనంగా దాచుకోలేక ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సులు సరిగా కడతారని చెబుతాడు.  
Image result for modi
ఇప్పుడు భారత దేశంలో కూడా ఇదే జరగబోతుంది..ఆ మద్య ప్రధాని నరేంద్ర మోడీ రూ.500, 1000 నోటు మార్చి వాటి స్థానంలో రూ.500, రూ.2000 తీసుకు వచ్చారు.  ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా తీసుకొచ్చిన రూ.2వేల నోటు ప్రింటింగ్ నిలిపివేస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా 200 వందల రూపాయల నోటు ముద్రణను ప్రారంభించారు.  ఇక రెండు వందల నోటు మార్కెట్ లోకి రాబోతుందని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి.  
Image result for new notes
ఆగస్ట్ నెలలో మార్కెట్ లోకి ఈ రూ.200 నోటు రాబోతున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2వేల రూపాయల నోట్లను ప్రింట్ చేయలేదు. అయితే ఏ లక్ష్యంతో అయితే వెయ్యి నోటు స్థానంలో రెండు వేల నోటు తీసుకు వచ్చారో..ఇప్పుడు ఆ లక్ష్యానికి గండి కొడుతున్నట్లు గుర్తించింది ఆర్ బి ఐ.  అంటే నోట్ల రద్దు తర్వాత 2000, 500 నోట్ల సర్క్యులేషన్ భారీగా తగ్గిపోయింది.
Image result for 200 new notes
100, 50, 20, 10 రూపాయల నోట్ల చెలామణిలో ఏడు శాతం పెరుగుదల కనిపించింది.  దీన్ని బట్టి మళ్లీ అక్రమార్కులు పెద్ద నోట్లను గప్ చుప్ గా దాచేస్తున్నట్లు తెలుస్తుంది. వీటి విలువ కనీసం రెండున్నర లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా ఉంటుందని ఆర్ బి ఐ తెలుపుతుంది. ఈ క్రమంలోనే మార్కెట్ లో నోట్ల కష్టాలను తీర్చేందుకు రూ.2వేల నోట్ల ప్రింటింగ్ నిలిపివేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: