Image result for lalu nitish broken friendship


రాజకీయాల్లో చిరకాల మిత్రత్వం ఎలా ఉండదో శత్రుత్వమూ అంతే.   తిరిగి బిజెపి అర్జెడి మధ్య స్నెహం మళ్ళా ఎలా చిగురించిందో తెలియదుగాని, ఈ రసవత్తర ఘట్టానికి స్క్రీన్-ప్లే మాత్రం ఆధునిక చాణక్య చంద్ర గుప్తులు నరెంద్ర మోడీ అమిత్ షా లే.


ఈ వ్యూహాత్మక రసవత్తర రాజకీయాల్లో మనసుతో సహా మనిషి మొత్తం మారింది ఆధునిక రాక్షసామాత్యుడు నితీష్ కుమార్ కథానాయకుడు. ధారుణంగా బలైంది మాత్రం శకుని తంత్రమే జీవితంగా మలచుకున్న లాలు ప్రసాద్ యాదవ్ మాత్రమే. మోడీ-షా వ్యూహత్మక చక్రబందంలో నితిష్ రాక్షస మంత్రాంగముతో బిహార్ లో మహాఘట్బందన్ నిలువునా కూలి పోయింది.


ఒక ఒర లో ఇమిడిన రెండు భిన్న కత్తులు,  దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఇద్దరు మిత్రులు, నితీశ్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు.   "ఏకత్వంగా కనిపించే ఈ భిన్నత్వం" ఎంతో కాలం నిలవదని ఆనాడే కొందరు విఙ్జులు వెలి బుచ్చిన అనుమానం ఏడాదిన్నర తిరిగేసరికి  అంతే సంచలనాత్మకంగా ఊహించినట్లే విడిపోయారు. 


ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ కుమార్ రాజీనామా చేయడంతో ఈ త్రికోణాత్మక  రాజకీయ ప్రేమభంధం అంటే రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్‌జేడీ)- జనతాదళ్‌ యునైటెడ్‌ (జేడీయూ)- కాంగ్రెస్‌ పార్టీల మహాకూటమి అనే మహాఘట్భందన్ ప్రయోగంతో ఏర్పడ్డ బీహార్ ప్రభుత్వం బుధవారం కుప్పకూలిపోయింది. బిహార్‌ రాష్ట్రంలో మరోదఫా  తీవ్ర "రాజకీయ సంక్షోభం" ఏర్పడిం ది. దీనికి పూర్వ రంగం లో జరిగిన  రాజకీయ వ్యూహాలు, మలుపులు, మెరుపులు, మరకలు ఏమిటో చూద్ధాం.   


Image result for lalu nitish broken friendship


వ్యూహాత్మకంగా జరిగినట్లు కనిపించే ఈ ప్రభుత్వ పతనానికి మార్గం సుగమం చేసింది బిజేపి అని ఎవరూ అనకుండా ఉండ లేరు. అలాగని బిహార్ రాజకీయ సంక్షొభంలో బిజేపి పాత్రను ఎవరూ విమర్శించలేని పరిస్థితి. 

విభిన్న రాజకీయ సంకట స్థితిలో నలిగి పోయారు నితీష్ కుమార్. సుప్రీం కోర్ట్ ఆదేశాలతో సిబిఐ  విచారణలో భారీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబాన్ని అటు రక్షించలేక ఇటు ప్రభుత్వం నుంచి బలవంతంగా వెళ్లిపొమ్మని చెప్పనూలేక పోయారు ముఖ్యమంత్రి. అలాగని స్వతహాగా సౌమ్యుడు ఋజువర్తనకల రాజకీయ నేతైన నితీష్ పాపపంఖిలమైన లాలు కుటుంబ ఆధిపత్యమున్న సంకీర్ణంతో కలిసి పనిచేయలేనూలేక  తనంతటతానే రాజీనామా చేశారు. 



పాట్నాలో సీఎంగా ముఖ్యమంత్రి పదవికి నితీశ్‌ కుమార్ రాజీనామా చేసిన సమయానికి యాదృచ్చికంగా ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కొద్ది నిమిషాల ముందే ప్రధాని నరెంద్ర మోదీ నితీశ్‌ కుమార్ను కళంకితులను వదిలించుకున్నందుకు అభినందిస్తూ ట్వీట్ చేశారు. అంతే కాదు  బిహార్‌ సంక్షోభ రాజకీయ వ్యవహారాల  పర్యవేక్షణకుగానూ బీజేపీ అధినాయకత్వం "త్రి-సభ్య కమిటీ" ని నియమించింది.


భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల తరవాత వ్యూహాత్మక వైఖరిలో ముందుకు వెళుతోంది. భాజపాకు సహకరించే శక్తులకు నమ్మకాన్ని కల్పించడం, వ్యతిరేక శక్తులను తుదముట్టించే ధోరణిలో పనిచేయటం. అదే బీహార్ లో బిజెపికి కలసివచ్చిన అంశం.


Image result for suseel modi amit shah narendra modi


243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌ లో అతిపెద్ద పార్టీ లాలూ-ఆర్జేడీకి 80 సీట్లున్నాయి. తర్వాతి స్థానంలో నితిష్-జెడీయూ (71), బీజేపీ(53), కాంగ్రెస్‌ (27) ఎల్‌జేపీ(2), ఆర్‌ఎల్‌ఎస్పీ (2), హెచ్‌ఎఎం (1), సీపీఐ-ఎంఎల్‌ లిబరేషన్‌కు‌ (3), ఇండిపెండెంట్లకు (4) సీట్ల బలం ఉంది.


అమిత్ షా ప్రయోగమే ఇదని బలంగా నమ్మటానికి కారణం మహాఘట్భంధన్ ప్రభుత్వం పాలనా సమయములోనే "నితీశ్‌ - బిజేపీ మద్దతు తీసుకుని, కళంకిత లాలూ ప్రసాద్ & కో ను పక్కన పెట్టాలి అని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుశీల్‌ కుమార్‌ మోదీ (చిన్న మోది) యూపీ ఎన్నికల తర్వాత బహిరంగ  ప్రకటనలు పలుమార్లు  చేశారు. 


"విశ్వసనీయత" తో నితీశ్‌ ను వశం చేసుకున్న షా బృందన్ ఖచ్చితంగా నితీష్ ను ముఖ్యమంత్రి చేసి తన "మాట నిలబెట్టుకొంటుందని" విఙ్జుల నమ్మకం. మహఘట్భందన్ కి ముందు నితీశ్‌ (జేడీయూ) 17 ఏళ్లపాటు ఎన్డీఏ లో భాగస్వామి. కాబట్టి ఆయనకు బీజేపీ ఎలా పనిచేస్తుందో, అది కాంగ్రెస్‌ కంటే ఏ మేరకు భిన్నమైనదో, మాట ఇస్తే కట్టుబడి ఉంటుందో లేక నీరుగారుస్తుందో అనే విషయాలపై సరైన అవగాహన ఉంది.



"కాంగ్రెస్ ముక్త భారత్" అనే లక్ష్యం తో పనిచేసే ప్రస్తుత మోడీ పరిపాలన తీరు ఎలా ఉన్నా, పార్టీ పరంగా "మాటంటే మాటే" తను యిచ్చిన మాటకు కట్టుబడి ఉండే సిద్ధాంతాన్ని బీజేపీ మొదటినుంచీ కొనసాగిస్తోంది. అధికారంలో లేని రాష్ట్రాల్లో సైతం స్థానిక పార్టీలతో బీజేపీ సాగించే స్నేహం, కాంగ్రెస్‌ పార్టీ స్నేహం కంటే చాలా భిన్నమైనది" అది నితీష్ కు బాగా తెలుసు.


Image result for suseel modi amit shah narendra modi



"నితీశ్‌ను దగ్గరకు తీసుకోవాలంటే, ముందుగా లాలూను దూరం చేయాలనేది" బీజేపీ పెద్దల వ్యూహం. ఆ మేరకు అమిత్‌ షా వ్యూహం పన్నడం,  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్‌ మోదీ దానిని అమలు పర్చడం, మొత్తం వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పర్యవేక్షించినట్లు తెలుస్తుంది. పసుగ్రాసం మేసిన అవినీతి పరుణ్ణుంచి నితీష్ ను విడగొట్టటం పెద్ద కష్టమైన పనేమీ కాదు. దాన్ని నిర్వహించటం మాత్రం విఙ్జతతో కూడి ఉండాలి. ఆ పని సుశీల్ అద్భుతంగా మానేజ్ చేశారు.  మొదట నితీశ్‌ కుమార్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు, విభేదాలు వచ్చి లాలూ ప్రసాద్  దూరమైతే నితీశ్‌కు బీజేపీ అండ ఉంటుందనే నమ్మకాన్ని జేడీయూ శ్రేణులకు, అంతకు మించి ప్రజలకు కల్పించారు. అంటే "అటు నుంచి నరుక్కురావడం.." అనే ప్రక్రియను సుశీల్‌ మోదీ  దిగ్విజయం చేశారు.


Image result for corrupt lalu family members



ఆ తర్వాత లాలూ కుటుంబంపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు లాలూ కుటుంబం అక్రమ ఆస్తుల కుంబకోణాలను తిరగతోడాయి. ఈ పరిస్థితుల్లో  లాలూ పుత్ర రత్నాలు తేజస్వీ, తేజ్‌ప్రతాప్‌లు రాజీనామా చెయ్యక తప్పని సంక్లిస్ట స్థితి ఏర్పడగా, నితీశ్‌ వాళ్ల రాజీనామాను ఘట్టిగా కోరకుండానే కళంకితులతో కలిసి పనిచేయలేనని చెప్పి చాలా విఙ్జత తో అంత్కంటే లౌక్యంగా లాలూ  కభంధ హస్తాల కౌగిలి నుంచి బయటపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: