రాజ్య సభ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ - డీ శ్రీనివాస్ పార్టీ మారబోతున్నారు అనీ తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళిపో బోతున్నారు అనీ మీడియా లో ఒక వర్గం తీవ్రంగా ప్రచారం చేస్తోంది. తెరాస  పార్టీ లో ఆయనకి ప్రస్తుతం మంచి రోజులు లేవు అనే వార్త అందరికీ తెలిసిందే. పార్టీ లో కొందరు నేతలతో కలిసి ఆయన మళ్ళీ తన కాంగ్రెస్  పార్టీ కి జంప్ అయ్యే సూచనలు గట్టిగా ఉన్నాయి అనేది మీడియా లో వస్తున్న న్యూస్ . తెరాస లో ఈయన గుర్తింపు సరిపడగా దక్కడం లేదు అనేది ఆయన ప్రధాన ఇబ్బందికర విషయంగా చెబుతున్నారు.


వ‌చ్చే ఎన్నిక‌ల్లో తన కుమారుడుకి నిజామాబాద్ అర్బ‌న్ టిక్కెట్ ఇవ్వాల‌నే డిమాండ్ ను ముఖ్య‌మంత్రి ముందు ఉంచార‌ట‌. అయితే, ఈ విష‌య‌మై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎటూ తేల్చ‌క‌పోవ‌డంతో డీఎస్ తీవ్ర అసంతృప్తికి లోనౌతున్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇలాంటి పరిస్థితి లో తన సొంతగూటికి తాను చేరుకోవడమే బెటర్ అనేది డీ ఎస్ ప్లాన్ గా చెప్పచ్చు.


దీనిమీద విపరీతమైన చర్చ జరుగుతూ ఉండగా డీ ఎస్ దీని గురించి గట్టిగానే స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ని తాను ఎప్పుడైతే వదులుకున్నానో అప్పుడే మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అని ఫిక్స్ అయ్యాను అనీ మీడియా లో సంబంధం లేని కథనాలు ఆపాలి అని కోరారు డీఎస్.ఇంకా ఇలాంటి పుకార్లు ఎందుకు వ‌స్తున్నాయో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని డీఎస్ మండిప‌డ్డారు.


" ఇది పాత్రికేయుల విలువలకి విరుద్ధమైన చర్య " అంటూ మీడియా కి ఒకరకమైన క్లాస్ తీసుకున్నారు డీఎస్ .కాంగ్రెస్ లో మాత్రం ఈ విషయం మీద డీఎస్ వస్తారు అన్నట్టే వార్తలు ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా హై క‌మాండ్ ప్ర‌త్యేక దృష్టి సారించిన సంగ‌తి తెలిసిందే. డిగ్గీ రాజాని కూడా తొలగించిన క్రమం లో కాంగ్రెస్ కి ఒకప్పుడు పెద్దగా ఉన్న డీ శ్రీనివాస్ ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్లాన్ లు నడుస్తున్నాయి అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: