సినిమాలంటే ఎవ్వరికైనా ఎంత ఇష్టమో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఇక సినిమా తెరపై కనిపిస్తే ఇంకేముంది సొసైటీలో సెలబ్రెటీ కావొచ్చు..లగ్జరీగా బతకవొచ్చు..ఎంతో గౌరవం సంపాదించొచ్చు..ఇలా చాలా మంది ఔత్సాహికులు అనుకుంటూ ఊంటారు.  అందుకోసం ప్రతిరోజూ స్టూడియోల చుట్టూ తిరుగుతూ ఒక్క చాన్స్ వస్తే చాలు అన్నట్లు పడిగాపులు కాస్తుంటారు.  అలాంటి వారి బలహీనతలు కొంత మంది దళారులు క్యాష్ చేసుకుంటారు.  ఇండస్ట్రీలో తమకు హీరో, దర్శకుల, నిర్మాతలు, టెక్నీషియన్స్ పరిచయం అంటూ..బోల్తా కొట్టిస్తుంటా.  
Image result for hyderabad cinema studios
అబ్బాయిల నుంచి అందినంత దోచుకుంటారు..ఇక యువతులనైతే లైంగిక వాంఛ కూడా తీర్చుకుంటారు.  అంతేకాదు వారిని భయపెట్టి..బ్లాక్ మెయిల్ చేసి వ్యభిచార రొంపిలోకి తోస్తారు.  ఇలా ఎంతో మంది అమ్మాయిలు తమ జీవితాలు నాశనం చేసుకొని ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ యువతిని సినిమా హీరోయిన్ చేస్తానని చెప్పి మోసం చేసి..చివరకు బ్లూ ఫిలిమ్ లో నటింప జేశాడు ఓ దుర్మార్గుడు. 
Image result for hyderabad cinema studios
24 ఏళ్ల యువతి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సాఫ్ట్ నర్సుగా పనిచేస్తుంది. ఆమె తమ్ముడి ద్వారా లోక్‌నాథ్ అనే వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడు.  ఇక యువతి అందంగా ఉందని సినిమల్లో ఖచ్చితంగా మంచి చాన్స్ వస్తుందని నమ్మబలికిన లోక్ నాథ్ తన తల్లి వద్దకు తీసుకు వెళ్లి ఇండస్ట్రీ వారితో పరిచయం చేయించాడు.  ఓ సినిమాలో చిన్న చాన్స్ ఇప్పించి..మూడు వేల రూపాయలు పారితోషికం ఇప్పించాడు. దీంతో లోక్ నాథ్ పై బాగా నమ్మకం పెంచుకుంది ఆ యువతి. ఈ క్రమంలో ఓ షార్ట్ ఫిల్మ్‌లో నటించేందుకూ ఆ నర్స్ అంగీకరించింది.
Image result for movies
ఆ యువతితో ఓ తెల్ల కాగితంపై సంతకం చేయించుకున్న విజయలక్ష్మి, యూనిట్ సభ్యులతో ఆమెను షూటింగ్‌కు పంపింది.  ఒక నిర్మానుషమైన ప్రదేశానికి తీసుకు వెళ్లి బలవంతంగా పది బ్లూ ఫిలిమ్స్ ఆ యువతిపై చిత్రీకరించారు.  ఈ విషయం ఎవరికైనా తెలిస్తే.. తన పరువు పోతుందనే భయంతో పాపం ఆ నర్సు తనకు జరిగిన అవమానాన్ని దిగమింగుకుంది. ఈ మద్య ఆ షార్ట్ ఫిలిమ్స్ సోషల్ మీడియాలో రావడంతో..ధైర్యం చేసిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: