ఏపీలో క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ఎంత ర‌స‌వ‌త్త‌రంగా జ‌రుగుతుందో ?  ఈ ఉప ఎన్నిక వేళ టీడీపీ, వైసీపీ మ‌ధ్య రాజ‌కీయం ఎలా ఎత్తులు, పై ఎత్తులుగా మారుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ ఉప ఎన్నిక వేళ ఎన్నో ప‌ద‌నిసలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక‌పై మరో ఆస‌క్తిక‌ర వార్త ట్రెండ్ అవుతోంది. నంద్యాల ఉప ఎన్నిక‌పై పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ స‌మీక్ష చేస్తున్నార‌ట‌. ఈ వార్త కాస్త విచిత్రంగానే ఉన్నా ఇది నిజ‌మనే అంటున్నాయి రాజ‌కీయ‌వ‌ర్గాలు.

jagan-kcr కోసం చిత్ర ఫలితం

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కేసీఆర్‌, జ‌గ‌న్ మ‌ధ్య ఇంట‌ర్న‌ల్ రిలేష‌న్ షిఫ్ ఉంద‌న్న సందేహాలు ఉన్నాయి. కేసీఆర్ చంద్ర‌బాబును ఎన్నిసార్లు విమర్శించినా జ‌గ‌న్‌ను మాత్రం ఎప్పుడూ ప‌ల్లెత్తుమాట అన‌లేదు. టీఆర్ఎస్ నాయ‌కుల‌ది కూడా అదే తీరు. దీంతో తెలంగాణ‌లో వైసీపీ - టీఆర్ఎస్ ర‌హ‌స్య బంధంపై టీడీపీ నాయ‌కుల‌తో పాటు ఇత‌ర విప‌క్ష పార్టీలు చాలాసార్లు విమ‌ర్శ‌లు చేశాయి.


ఇక ఇప్పుడు వినిపిస్తోన్న మ‌రో టాక్ ప్ర‌కారం నంద్యాల ఉప ఎన్నిక కోసం తెలంగాణ నుంచే వ‌స్తోంద‌ట‌. అస‌లు విష‌యం ఏంటంటే తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన మిష‌న్ భ‌గీర‌థ ప‌నుల్లో వైసీపీ పుంగ‌నూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి కేసీఆర్ రూ. 3 వేల కోట్ల విలువైన ప‌నులు కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. ఈ కాంట్రాక్టు ప‌నుల‌ను పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి చూస్తున్నారు.

jagan-kcr కోసం చిత్ర ఫలితం

తాజాగా మిథున్‌రెడ్డి నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్‌రెడ్డి గెలుపు కోసం తెలంగాణ కాంట్రాక్టుల సొమ్ము నుంచి రూ. 70 కోట్ల‌ను అక్క‌డ‌కు త‌ర‌లిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ త‌ర‌లింపు అంతా కేసీఆర్ ఆధ్వ‌ర్యంలోనే జ‌రుగుతుంద‌ని టాక్‌. చంద్ర‌బాబును ఏదోలా దెబ్బ‌కొట్టేందుకే కేసీఆర్ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో కూడా వైసీపీ స‌పోర్ట్ చేస్తున్నార‌న్న గుస‌గుస‌లు ఇప్పుడు న‌డుస్తున్నాయి. 

peddireddy mithun reddy కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: