నంద్యాల ఉప ఎన్నిక విషయం లో వైకాపా ఈ రేంజ్ లో టీడీపీ కి పోటీ ఇస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు . పూర్తిగా టీడీపీ పక్షం అవ్వాల్సిన నంద్యాల సీటు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా వైకాపా కూడా బలమైన పోటీదారు గా కనిపిస్తున్న వేళ వ్యూహాలూ ప్రతి వ్యూహాలతో నంద్యాల ఉప ఎన్నిక సమరం రసకందాయం లో పడింది.


నంద్యాల ఉప ఎన్నిక లో అత్యంత కీలకమైన గోస్పాడు మండలం పైన రెండు పార్టీలూ తీవ్రంగా దృష్టి పెట్టి. పోయిన ఎన్నికల్లో వైకాపా కి ఈ ప్రాంతం లో ఏడువందల యాభై ఏడు ఓట్ల మెజారిటీ వచ్చినట్టు చెబుతున్నారు.


దాదాపు ఇరవై ఎనిమిది వేల ఓట్లు పైన ఉండగా ఈ మండలం ఓటర్లని మచ్చిక చేసుకోవడం కోసం రెండు పార్టీలూ చాలా కష్టపడుతున్నాయి. ఈ ప్రాంతం లో అత్యధిక ఓటర్లు టీడీపీ కి వ్యతిరేకంగా కనిపిస్తూ ఉండడం విశేషం.


అదే టైం లో వైకాపా చాలా తెలివిగా వైకాపా సీనియర్ నాయకుడు, ప్రకాశం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ బాలినేని శ్రీనివాస రెడ్డి ని రంగంలోకి దించింది. ప్రచారం రానున్న సోమవారం ముగుస్తుంది ఇలోగా నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచినా బాలినేని తో స్పెషల్ ప్రచారం చేయిస్తున్నారు ఈ ప్రాంతం లో .

మరింత సమాచారం తెలుసుకోండి: