ఒక జిల్లాకు సర్వఅధికారాలు ఉండే కలెక్టర్ ఎంతో మందికి ఆదర్శంగా ఉండాలీ అంటారు.  అది మాట్లాడే మాట నుంచి ధరించే వస్త్రాల వరకు ఎన్నో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.  అయితే వరంగల్  కలెక్టర్ బాధ్యతలు నిర్వహింస్తున్న ఆమ్రపాలి జీన్స్, టీషర్టులను గత కొంత కాలంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ వచ్చింది.  
Image result for | Warangal Collector Amrapali Visit Forest
ఈ విషయంపై పలువురు అధికారులు ఆమె వస్త్రధరణపై పలు విమర్శలు చేశారు.  ఇక విషయం కాస్త తెలంగాణ ముఖ్యమంత్రి దాకా వెళ్లడంతో  ఇటీవల రాష్ట్ర అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమైన సీఎం కేసీఆర్, అధికారులు దుస్తులు, ముఖ్యంగా మహిళా అధికారులు ధరిస్తున్న దుస్తుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఆమె ఆధునిక పోకడలను తగ్గించాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారని అన్నారు.  

దీంతో వరంగల్ కలెక్టర్ ఆమ్రపాళి  డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది.  71వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో పొడవు చేతులతో నిండుగా చీరకట్టుతో హాజరైన ఆమె, మీడియా ముందుకు మాత్రం రాకపోవడం గమనార్హం.   మంత్రులు, అధికారులు, అధికార ప్రతినిధులు అందరూ చేనేత దుస్తులు ధరించాలని సూచనలాంటి ఈ కలెక్టరమ్మపై బాగానే పనిచేసిందని అనుకుంటున్నారు.
Image result for కలెక్టర్ ఆమ్రపాలి
కాగా, ఎప్పుడూ మీడియాతో ఫ్రీగా మాట్లాడే కలెక్టర్ ఆమ్రపాలి.. మీడియా ముందు చాలా జాగ్రత్త పడినట్లు కనిపిస్తుంది.  అంతే కాదు ఆమె స్వతంత్ర వేడుకల్లో ఒక్కసారి స్లిప్ కావడంతో కాస్త కంగారులో ఉన్నట్లు అనిపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: