ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా డ్రగ్స్ పేరే వినిపిస్తుంది.  ఈజి మనీ కోసం కొంత మంది అమాయకుల జీవితాలతో ఆడుకుంటూ..వారిని మత్తుకు బానిసలుగా చేస్తూ భావిజీవితాలను నాశనం చేస్తున్నారు.  ఈ మద్య హైదరాబాద్ లో పట్టు బడ్డ డ్రగ్స్ ముఠా సభ్యులు వెల్లడించిన వివరాలు చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.  డ్రగ్స్ కి ఇంతకాలం యువతనే బలైందని అనుకున్నారు..కానీ విద్యార్థులు సైతం ఈ డ్రగ్స్ కి బానిసలైనట్లు వారి విచారణలో తేలింది.   తాజాగా పిలిప్పీన్స్‌లో డ్ర‌గ్స్ అమ్ముతున్న వారిపై పోలీసులు దాడులు చేశారు.
Image result for PHILIPPINE BLOODIEST
మంగ‌ళ‌వారం ఒక్క రోజే ఆ దేశ‌ పోలీసులు సుమారు 32 మందిని కాల్చేశారు.  గత కొంత కాలంగా ఇక్కడ డ్రగ్స్ అమ్ముతున్న వారిపై  ఆ దేశాధ్య‌క్షుడు రోడ్రిగో డ్యుటెర్టి ఉక్కుపాదం మోపారు.  డ్రగ్స్ తో యువత జీవితాలతో ఆడుకుంటున్న కొంత మంది ముఠా సభ్యులను నిర్థాక్షిణ్యంగా ఏరిపారేశారు.  రోడ్రిగో డ్యుటెర్టి  గ‌త ఏడాది బాధ్య‌త‌లు స్వీక‌రించినప్పటి నుంచి డ్రగ్స్ అమ్మకం, తయారీ దారులపై ప్రత్యేక దృష్టి సారించారు.  

మ‌నీలాకు ఉత్త‌రం వైపున ఉన్న బులాక‌న్ ప్రావిన్సులో జ‌రిగిన సోదాల్లో భారీ హింస చోటుచేసుకున్న‌ది. 24 గంట‌లు కొన‌సాగిన త‌నిఖీల్లో పోలీసులు 32 మంది డ్ర‌గ్ వ్యాపార‌స్తుల‌ను కాల్చేశారు. వంద మందిని అరెస్టు చేశారు.  తన దేశంలో డ్రగ్స్ అనే మాటే వినపడకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశారు రోడ్రిగో డ్యుటెర్టి. 


మరింత సమాచారం తెలుసుకోండి: