టీడీపీ వైపు పూర్తిగా వాలిపోతుంది అనుకున్న నంద్యాల ఉప ఎన్నిక సమరం ఇప్పుడు టీడీపీ కే గండి పెట్టేలా ఉంది. గెలిచెంత సీన్ లేకపోయినా వైకాపా ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఇస్తుంది అని అంటున్నారు అందరూ.


ఎదుటి పార్టీని దెబ్బ కొట్టగలదు అనుకున్న ఏ అంశాన్నీ రెండు పార్టీల వారూ వదలడం లేదు. వైకాపా కి అనుకోని స్థాయి లో సరైన టైం లో గట్టి దెబ్బ పడింది.ఆ పార్టీ నాయకుడు గంగుల ప్రతాప రెడ్డి ఆ పార్టీని వీడి టీడీపీ లో దాదాపు గా చేరిపోయారు.


ఇప్పుడు నంద్యాల రేసు లో ఇదే అతిపెద్ద చర్చ అని చెప్పుకోవచ్చు. వైకాపా ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర రెడ్డి కి ఈయన సోదరుడు కావడం విశేషం. గతం లో చాలాసార్లు ఎంపీగా  , ఎమ్మెల్యే గా ఉన్న ఈయనకి నంద్యాల‌, ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క వ‌ర్గాల్లో మంచి ప‌ట్టు ఉంది.


దీంతో ఆయ‌న చేరిక‌ తెలుగుదేశం పార్టీకి బాగా క‌లిసొచ్చే అంశంగా చెబుతున్నారు. గంగుల సోదరులు మొదట్లో టీడీపీ పార్టీ వారే భూమా టీడీపీ లోకి వచ్చిన తరవాత తాము ఎంతమాత్రం టీడీపీ లో ఉండలేము అని బయటకి వచ్చేసారు. ఇలా ఒక పెద్ద నాయకుడు నియోజికవర్గ ప్రజలలో పట్టున్న వాడు వైకాపా లోంచి వెళ్ళిపోవడం వారికి చావు దెబ్బ అనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: