టీడీపీ జనాలు నంద్యాల ఉప ఎన్నిక విషయం లో పవన్ కళ్యాణ్ మీద గంపెడు ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు. పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండడం టీడీపీ కి చేదు వార్త కాగా వైకాపా కి ఇది సూపర్ న్యూస్ . పవన్ నోరు తెరిచి స్పందించి టీడీపీ కి ఓటు వెయ్యండి అంటేనే టీడీపీ హ్యాపీ లేదంటే వైకాపా తో టీడీపీ ని కూడా ఆయన సపోర్ట్' చెయ్యనట్టు' కాబట్టి ఏ పార్టీ అయినా ఒకటే అని పవన్ స్వయంగా న్యూట్రల్ గా వెల్లడించినట్టు అవుతుంది. ఇది టీడీపీ కి ఇష్టం లేదు.


దాదాపు యాభై వేల మందిని ప్రభావితం చెయ్యగలిగిన పవన్ కళ్యాణ్ ఒక్క మాట లేదా, ట్వీట్ పెడితే ఇక మిగితాడు తమ అనుకూల మీడియా చూసుకుంటుంది కదా అనేది టీడీపీ అజెండా . కానీ నంద్యాల ఉప ఎన్నిక‌ల విష‌యంలో జ‌న‌సేన పార్టీది త‌ట‌స్థ వైఖ‌రి అని ప‌వ‌న్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.


నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఎవ్వ‌రికీ తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌నీ, అలా ఎవ‌రైనా చెప్పుకుని ప్ర‌చారం చేసుకుంటే న‌మ్మొద్దంటూ కూడా ప్ర‌జ‌ల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ్ఞ‌ప్తి చేశారు.జనసేన నిర్మాణ దశలో మాత్రమే ఉంది అనీ తమ మద్దతు ఎవ్వరికో ఇచ్చేంత సీన్ జనసేనకి లేనేలేదు అన్నట్టు మాట్లాడారు ఆయన.


దాదాపు రెండేళ్ల సుదీర్ఘ విరామం త‌రువాత ఈ మ‌ధ్య‌నే ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుతో ప‌వ‌న్ భేటీ అయ్యారు. అంతేకాదు, కీల‌క‌మైన కాపుల రిజ‌ర్వేష‌న్లు వంటి విష‌యాల‌పై కూడా చంద్ర‌బాబు వైఖ‌రికి ప‌వ‌న్ మ‌ద్ద‌తు ప‌లికారు. అయినా కనీ పవన్ నుంచి ఇలాంటి రియాక్షన్ ఏంటి అనేది టీడీపీ కి అర్ధం కాని విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: