నంద్యాల ఉపఎన్నిక ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 23వ తేదీ ఎన్నిక జరగనుంది. ఇక్కడ గెలిచేందుకు ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకునేందుకు టీడీపీ, వైసీపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రెండు పార్టీలూ తమదే గెలుపు అనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఉప ఎన్నిక జరగకుండా చూసేందుకు కుట్రలు జరుగుతున్నాయనే సమాచారం హాట్ టాపిక్ గా మారింది.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          నంద్యాల ఉపఎన్నికను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతోందంటా సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం ఇప్పుడు సంచలనానికి కారణమవుతోంది. నంద్యాలలో ఓడిపోతామనే భయంతో అక్కడ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు వైసీపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. టీడీపీ శ్రేణులతో అంతర్గతంగా జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీ శ్రేణులు సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు సూచించారు.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అక్కడ మాటలతూటాలు పేలుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ అక్కడే మకాం వేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చేయాలని, ఉరిశిక్ష విధించినా తప్పులేదని జగన్ తన ప్రచారంలో కామెంట్స్ చేశారు. ఇవి టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేందుకే చేశారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉద్రిక్తతలకు దారితీసేలా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టాలనేది జగన్ ఉద్దేశంగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          టీడీపీ శ్రేణులు అప్రమత్తంగా లేకపోతే ఇలాంటివి ముందు ముందు కూడా పునరావృతమవుతాయని.. ఎవరు రెచ్చగొట్టినా పూర్తి సంయమనంతో వ్యవహరించాలని పదేపదే సూచించారు చంద్రబాబు. సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు సమాచారం. సీఎంతోపాటు మంత్రులు కూడా ఇదే కామెంట్స్ చేయడంతో తెరవెనుక ఏదో జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: