తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకేలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు తుది అంకానికి చేరుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. నేడోరేపో పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాల విలీనం ఖాయమవుతున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమ్మ జయలలిత మరణంపై విచారణ జరిపించాలని నిర్ణయించింది. అంతేకాదు.. అమ్మ నివసించిన వేద నిలయాన్ని మ్యూజియంగా తీర్చిదిద్దాలని తీర్మానించింది.

palanisamy కోసం చిత్ర ఫలితం

          తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై అనేక అనుమానాలున్నాయి. ఆమె మరణం తర్వాత ఆ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు సుపరిచితమే! శిశికళ పార్టీని చేజిక్కించుకోవడం, ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా దక్కించుకోవాలని ప్రయత్నించడం.. అదే సమయంలో అక్రమాస్తులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె బెంగళూరు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వెళ్తూ వెళ్తూ తన అనుంగుడు దినకరన్ చేతిలో పార్టీ పగ్గాలను పెట్టి వెళ్లింది. పన్నీర్ సెల్వం నుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని పళనిస్వామికి కట్టబెట్టింది.

sasikala dinakaran కోసం చిత్ర ఫలితం

          ఇక్కడే కేంద్రంలోని బీజేపీ సర్కార్ జోక్యం చేసుకుంది. శశికళను అన్నాడీఏంకే బాధ్యతల నుంచి తప్పించాలని భావించినట్టు సమాచారం. పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా శిశకళను పూర్తిగా పక్కనపెట్టొచ్చనేది బీజేపీ ప్లాన్. తన యాక్షన్ ప్లాన్ ను స్లోగా అమలు చేయడం మొదలుపెట్టింది. తొలుత పళనిస్వామిని శశికళకు దూరం చేయాలని స్కెచ్ వేసి.. ఆ దిశగా నరుక్కుంటూ వచ్చింది. ఇందులో భాగంగానే దినకరన్ ను పార్టీ పగ్గాల నుంచి తప్పిస్తూ పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పార్టీపై శశికళకు పట్టులేకుండా పోయింది.

sasikala dinakaran కోసం చిత్ర ఫలితం

          అంతటితో ఆగని ముఖ్యమంత్రి పళనిస్వామి తాజాగా అమ్మ మరణంపై విచారణకు ఆదేశించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు జయలలిత దగ్గరికి ఎవరినీ రానివ్వకుండా శశికళ కుట్రపూరితంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అన్నాడీఎంకే వర్గాలు కూడా అమ్మ మరణంపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదాస్పద అంశంపై విచారణకు ఆదేశించడంతో శిశికళకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది.

palanisamy కోసం చిత్ర ఫలితం

          జయలలిత మరణం తర్వాత ఆమె నివసించిన వేద నిలయాన్ని శశికళ ఆక్రమించింది. అందులో తనే ఉంటోంది. ప్రస్తుతం ఆమె జైలుకు వెళ్లడంతో ఆమె కుటుంబ పరివారమంతా అక్కడే తిష్టవేసింది. ఇప్పుడు వాళ్లను ఇంట్లోనుంచి వెళ్లగొట్టే పరిస్థితి వచ్చింది. ఇలా శశికళను రోడ్డుపై పడేయబోతోంది పళనిస్వామి సర్కార్. ఈ రెండు నిర్ణయాలు అమలైన తక్షణం శశికళ రాజకీయాలకు సమాధి కట్టినట్టే.!

palanisamy కోసం చిత్ర ఫలితం

          ఇంకోవైపు పళనిస్వామి, పన్నీరు సెల్వం వర్గాలు కూడా విలీనానికి మార్గం సుగమం చేశాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కనుసన్నల్లో తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తీసుకోబోతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: