నంద్యాల ప్రజలకు డబ్బు పంట పండుతోంది. పార్టీలు పోటీపడి డబ్బులు పంచుతున్నాయి. కొంతమందికి నేరుగా డబ్బు అందుతుంటే మరికొంతమందికి చిట్టీల రూపంలో ముడుతోంది. ఓటర్ల పరిస్థితి ఇలా ఉంటే మీటింగ్ లకు వచ్చే జనానికి మంచి గిరాకీ ఏర్పడింది. మీటింగ్ కు రావాలని ఓ పార్టీ డబ్బులిస్తుంటే.. అపోజిషన్ పార్టీ మీటింగులకు వెళ్లొద్దంటూ మరో పార్టీ డబ్బులిస్తోంది. మొత్తానికి ఎటు చూసినా డబ్బే.!

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          నంద్యాల ఉపఎన్నికను ప్రధాన పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకూడదని నిర్ణయించుకున్న ఆ పార్టీలు ఓట్లకోసం నోట్లు ముట్టజెప్పడంలో చాలా బిజీగా ఉన్నాయి. మెజారిటీ ఓటర్లు డబ్బు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          ఓటర్లకు ఇరు పార్టీలకు చెందిన నేతలు తమదైన శైలిలో డబ్బు పంచుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రత్యేకంగా ముద్రించిన ఓ స్లిప్ ను అందజేస్తోంది. అందులో జై వైసీపీ, ఓట్ ఫర్ వైసీపీ అని రాసి ఉంది. దాన్ని ఫలానా చోటికి తీసుకెళ్తే మీకు డబ్బులు ముడుతాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నట్టు సమాచారం. ఆ స్లిప్పులు అందుకున్నవాళ్లు హైదరాబాద్, బెంగళూరు తదితర ప్రదేశాల్లో డబ్బులిచ్చే చోటికి వెళ్తున్నట్టు కూడా తెలుస్తోంది.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          ఇక రెండోరకం నేరుగా ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్ చేయడం. ఇప్పటికే పలువురు ఓటర్ల బ్యాంకు ఖాతాలను సేకరించిన పార్టీ నేతలు వాటిలో డబ్బులు జమ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారనే సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు.. ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈసీ అప్రమత్తమైంది.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          టీడీపీ, వైసీపీలు ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తుండడంతో వాటికి జనాల తరలింపు పెద్ద ప్రాసెస్ గా మారింది. కొంతమంది దళారులు ఆయా పార్టీల ప్రచార సభలకు జనాన్ని తరలించే పనిలో బిజిగా ఉన్నారు. మీటింగ్ లకు వచ్చే మగాళ్లకోసం రోజుకు 500 రూపాయల నగదు, బిర్యానీ, మందు అందజేస్తున్నారు. ఆడవాళ్లకైతే 250 రూపాయల నగదు, బిర్యానీ పొట్లం అందిస్తున్నారు.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          ఇంతటితో ఆగని పార్టీలు ఎదుటివాళ్లను దెబ్బకొట్టేందుకు మరో ప్లాన్ వేశాయి. ఎదుటిపార్టీల సమావేశావాలకు వెళ్లకూడదంటూ డబ్బులిస్తున్నట్టు సమాచారం. తమ పార్టీకి రావాలంటూ డబ్బులివ్వడం చాలా కామన్. అపోజిషన్ పార్టీ మీటింగ్ లకు వెళ్లొద్దంటూ కూడా డబ్బులిస్తుండడంతో ఇంట్లో ఉంటున్నా కూడా చాలా మందికి డబ్బు వస్తోంది. ఇదేదో బాగుందంటూ ఫుల్ ఖుషీలో ఉంటున్నారు నంద్యాల ప్రజలు.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          ఇక బెట్టింగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెయ్యి కోట్లకుపైగా బెట్టింగ్ వ్యాపారం జరుగుతున్నట్టు అంచనా. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, నెల్లూరు, కడప.. తదితర ప్రాంతాల్లో తిష్టవేసిన బుకీలు జోరుగా బెట్టింగ్ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: