నంద్యాల ఉపఎన్నికల్లో పార్టీలు డబ్బును పంచుతున్నాయనే విషయం ఓపెన్ అయిపోయింది. వైసీపీ డబ్బు పంచుతోందని టీడీపీ, అధికారపక్షమే డబ్బు పంచుతోందని ప్రతిపక్షం పోటాపోటీ విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే పలుచోట్ల డబ్బులు పంచుతూ వైసీపీ నేతలు దొరికిపోవడం, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను అరెస్టు చేసినప్పుడు బహిరంగంగా డబ్బులు పంచిన బాలకృష్ణను ఎందుకు అరెస్టు చేయడం లేదనేది ఇప్పుడు వైసీపీ నేతల ప్రశ్న.

cash for vote at nandyal కోసం చిత్ర ఫలితం

          ఓట్లకోసం నోట్లు పంచడం నేరం. అయితే ప్రతి ఎన్నికలోనూ ఇంతోకొంతో డబ్బు పంపిణీ జరగడం కామన్ అయిపోయింది. అయితే అదంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయేది. కానీ ఇప్పుడు అంతా ఓపెన్. ఓటర్లు కూడా ఇచ్చింది కాదనకుండా తీసుకుంటున్నారు. కిమ్మనకుండా కూర్చుంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే సంబంధం లేదు. ఎవరిచ్చినా తీసుకుంటున్నారు.

cash for vote at nandyal కోసం చిత్ర ఫలితం

          నంద్యాలలో డబ్బు పంచుతున్నారంటూ కొంతమంది వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 4 లక్షలకు పైగా నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. వారంతా కడప, కర్నూలు, అనంతపురం తదితర జిల్లాలకు చెందిన వైసీపీ కౌన్సెలర్లని పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్నవారిని వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి పరామర్శించడం, వారి సమక్షంలో పోలీసులపై నోరు పారేసుకోవడం వివాదానికి దారితీసింది.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          అయితే – తమ పార్టీవారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. బాలకృష్ణను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. బాలకృష్ణ డబ్బులు పంచుతూ నేరుగా దొరికిపోయినా కూడా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు. బాలకృష్ణ డబ్బుల పంపిణీకి సంబంధించి వైసీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అటు టీడీపీ నేతలు కూడా వైసీపీ డబ్బుల పంపకాలకు సంబంధించి ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. మరి పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో ఈసీ ఎలాంటి చర్య తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: