నంద్యాల బైపోల్ రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇన్నాళ్లూ ప్రచారంలో పోటీ పడిన వైసీపీ, టీడీపీ.. ఇప్పుడు పరస్పర ఫిర్యాదులు చేసుకోవడంలోనూ పోటీ పడుతున్నారు. వైసీపీ, టీడీపీలు ఒకదానిపై మరొకటి ఎన్నికల సంఘం ముందు ఫిర్యాదులు చేసుకున్నాయి.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

నంద్యాల ఉపఎన్నికల్లో వైసీపీ డబ్బులు పంచుతోందంటూ టీడీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీకి చెందిన నేతలే స్వయంగా డబ్బులు పంచుతున్నారని, ఇందుకు సంబంధించి పోలీసులు పలువురిని అరెస్టు చేశారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

అంతేకాదు.. జగన్ చేసిన కామెంట్స్ పైన కూడా టీడీపీ ఫిర్యాదు చేసింది. ముఖ్యమంత్రిని పట్టుకుని నరికేయాలనడం, ఉరితీయాలనడం ఆయనలోని ఫ్యాక్షనిస్టు ధోరణిని బయటపెట్టాయని టీడీపీ నేతలు ఆరోపించారు. రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన జగన్ పై చర్యలు తీసుకోవాలని కోరాయి.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

సాక్షి ఛానల్ లో నిరంతరాయంగా జగన్, వైసీపీ ప్రచారంపై ప్రసారాలు జరుగుతున్నాయని, సాక్షి పేపర్ లో పేజీలకొద్దీ కవరేజ్ చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. వీటన్నింటిన పెయిడ్ ఆర్టికల్స్ గా పరిగణించాలని కోరింది. సర్వేలపై నిషేధం విధిస్తూ రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

వైసీపీ కూడా టీడీపీపై ఇదే స్థాయిలో ఫిర్యాదు చేసింది. బాలకృష్ణ స్వయంగా డబ్బులు పంచుతూ దొరికిపోయారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. టీడీపీకి ఓట్లు వేయకుంటే ప్రభుత్వ పథకాలు వర్తించబోవంటూ బెదిరిస్తున్నారని ఆరోపించింది. టీడీపీ ప్రలోభాలకు తెరదీసిందని.. వెంటనే దీనిపై స్పందించాలని కోరాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: