నంద్యాల ఉపఎన్నికల ప్రచారం కొత్తపోకడలకు తెరదీస్తోంది. పార్టీలు, నేతలు ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాయి. ప్రచారంలో వ్యక్తిగత విమర్శలు చేయడం చాలా కామనైపోయింది. అయితే ఇప్పుడు డబ్బుల పంపిణీలో మరింత దిగజారుడుతనానికి పాల్పడుతున్నారు నేతలు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిపై మరింత బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

Image result for nandyal bypoll cash

          ముఖ్యమంత్రి చంద్రబాబు వాహనంలో భారీగా డబ్బు పట్టుబడిందంటూ ఓ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారానికి దిగింది. వాట్సాప్, ఫేస్ బుక్ లలో ఓ మెసేజ్ ను సర్క్యులేట్ చేస్తోంది. ఆ మెసేజ్ సారాంశాన్ని ఇలా ఉంది.

 

“ ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ...ముఖ్యమంత్రికి  చెందిన 400 కోట్లు పట్టివేత ...

విజయవాడ నుండి నంద్యాలకి కంటైనర్లో తరలిస్తున్న 400 కోట్లని పట్టుకున్న ఎన్నికల సంఘం .

ముఖ్యమంత్రి పేరుతొ ఉన్న వాహనంలో తరలింపు . వాహనానికి తోడుగా వస్తున్న పోలీసులు . రాష్ట్ర పోలీసులుకి ఎన్నికల సంఘానికి తీవ్ర వాగ్వివాదం .

ఇది ముఖ్యమంత్రి వాహనం అని దీనిని తనిఖీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని అడ్డుకొంటున్న రాష్ట్ర పోలీసులు . నేరుగా రంగంలోకి దిగిన చంద్రబాబు , ఎట్టిపరిస్థితులలో వాహనాన్ని తనిఖీకి అంగీకరించకూడదని డ్రైవర్ ని మరియు తోడుగా ఉన్న పోలీసులని ఆదేశించిన చంద్రబాబు.”

 

... ఇదీ ఆ మెసేజ్ సందేశం. అయితే.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పాంట్రీ వ్యాన్ ను నంద్యాల పంపించింది ప్రభుత్వ యంత్రాంగం. ఇందులో డబ్బు తరలిస్తున్నారని ప్రచారం జరగడంతో ఎన్నికల అధికారి ఈ వ్యాన్ ను తనిఖీ చేసినట్టు తెలుస్తోంది. అందులో ఏమీ లేవని ధృవీకరించినట్టు సమాచారం.

Image result for nandyal bypoll cash

అయితే.. ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు ప్రచారం చేయడంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఓటమిభయంతో వైసీపీ శ్రేణులు అడ్డదారులు తొక్కుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మెసేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది.. ఎవరెవరు సర్క్యులేట్ చేశారు.. అనే అంశాలపై విచారణ జరిపించాలని పోలీసులను కోరినట్టు తెలుస్తోంది. మరి చూద్దాం.. ఏం జరుగుతుందో..!


మరింత సమాచారం తెలుసుకోండి: