ఇవాళ ఉదయం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లో ముఖ్యమంత్రి నివసించే ప్రాంతం లో పోలీసుల కలకలం రేగింది. సరిగ్గా కొన్ని నిమిషాల క్రితం పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది.


ల్యాండ్ లైన్ నుంచి వచ్చిన ఈ కాల్ లో " యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ ని తమ ముఠా చంపెయ బోతోంది అనీ సరిగ్గా గంట వ్యవధి లో అతన్ని చంప బోతున్నాం , దమ్ముంటే కాపాడుకోవాలి " అనేది ఆ కాల్ సారాంశం. అతన్ని రక్షించడం కొసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా అనీ తాము అన్ని రకాలుగా సిద్దంగా ఉన్నాం అని ప్రకటించారు వాళ్ళు.


అయితే పోలీసులు వెంటనే ఈ కాల్ పట్ల అప్రమత్తం అయ్యి, ముఖ్యమంత్రి కి సెక్యూరిటీ పెంచేశారు. ప్రస్తుతం విశ్రుత పర్యటన లో ఉన్న ఆయనకి త్రెట్ ఉంది అని గత కొన్ని నెలలుగా వినిపిస్తూ ఉన్నా ఈ సారి ఆ మ్యాటర్ కాస్తంత సీరియస్ అయ్యింది. దాంతో అందరూ అప్రమత్తం అవ్వాల్సి వచ్చింది. ఆ ఫోన్ నెంబర్ ని గుర్తించడం లో పోలీసు వ్యవస్థ విఫలం అవ్వడం తీవ్ర వివాదానికి దారి తీసింది.


ఫోన్ నెంబర్ ను గుర్తించే ప్రయత్నం చేయగా, దానిని వాయిస్ ఇంటర్నెట్ కాల్ గా గుర్తించారు. దీంతో ఫోన్ చేసిన ఆగంతుకుడెవరో గుర్తించడంలో విఫలమయ్యారు. దీంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను యూపీ యాంటీ టెర్రరిస్టు స్వ్కాడ్ (ఏటీఎస్) కు అప్పగించారు. ఇవాళ రేపు ఆదిత్య నాథ్ కి గట్టి భద్రత ఇవ్వబోతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: