ఏ రాష్ట్రానికి అయినా సచివాలయం అంటే ఒక గొప్ప ప్రదేశం.. నిజానికి ప్రజలకీ ప్రజా ప్రతినిదులకీ మధ్యన ఇదొక వారధి గా ఉండాల్సిన ప్రదేశం. కొందరి దేవాలయం గా కూడా చూసుకునే ఈ సచివాలయం లో ఒక పౌరుడు, ఓటరు చనిపోవడం అంటే చిన్న విషయమా ? ఇప్పుడు అదే జరిగింది ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లో ఒక మనిషి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం గా మారింది.


నెల్లూరు కి చెందిన రాజగోపాల్ అనే వ్యక్తి ఆరెంపీ డాక్టర్ గా పని చేస్తున్నాడు. నిండా అప్పులలో మునిగిపోయిన ఆయన అప్పులు వెనక్కి తీర్చడం లో విఫలం అయ్యాడు. వాటిని తీర్చాలంటూ ఒత్తిళ్లు, వేధింపులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు తన బాధను చెప్పుకుందామని అమరావతి చేరాడు.


అప్పులవాళ్ళు తననీ తన భార్యనీ చంపేస్తాం అంటూ బెదిరించడం తో పోలీసు కేసు కూడా పెట్టాడు. అయినా పోలీసుల నుంచి సరైన స్పందన లేదు, జిల్లా కలక్టర్ ని కలిసినా అతని దగ్గర కూడా అప్పాయింట్ మెంట్ దొరకలేదు. దీంతో తన కి ఆరాధ్య నాయకుడు అయిన చంద్రబాబు తో తన బాధ చెప్పుకోవాలి అని బయలు దేరాడు.


గత వారంగా సచివాలయం చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు రాజగోపాల్. కానీ చంద్రబాబు అపాయింట్ మెంట్  దొరకలేదు. అపాయింట్ మెంట్ లభించకపోవడంతో మనస్తాపం చెందిన రాజగోపాల్ వెంటతెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన సచివాలయ సిబ్బంది హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. చికిత్స చెందుతూ ఆయన మృతి చెందారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: