నంద్యాల ఉప ఎన్నికల విషయం లో టీడీపీ ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని అడుగులు వేస్తోందో చూస్తూనే ఉన్నాం మనం. టీడీపీ ముందు చూపు చూస్తుంటే ప్లానింగ్ అదిరిపోయింది అని మెచ్చుకోక తప్పదు. ఎలాగైనా సరే రాజకీయాలలో ముందు చూపు చాలా చాలా ముఖ్యమైన అంశం .. నంద్యాల ఎన్నికలకి సరిగ్గా వారం టైం ఉండగా గంగుల ప్రతాపరెడ్డి ని తమ పార్టీ లోకి లాక్కొచ్చి వైకాపాకి సూపర్ షాక్ ఇచ్చింది టీడీపీ.


అయితే ఆయన్ని పార్టీలోకి తీసుకోవడం కి సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యమైనది మొదటిది ఉప ఎన్నికలో తమ పార్టీ గెలుపు కోసం కాగా రెండోది 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని గంగుల ప్ర‌తాప్ రెడ్డిని టీడీపీలోకి తీసుకున్న‌ట్టు చెప్పుకోవ‌చ్చు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కి టీడీపీ నుంచి నంద్యాల అసెంబ్లీ సీటు, లేదా నంద్యాల ఎంపీ టిక్కెట్ ఆయ‌న‌కి ఇచ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్టు ఇప్ప‌ట్నుంచే వినిపిస్తోంది.


అలాంటి ఒప్పందం లేకుండా గంగుల వచ్చే ఛాన్స్ లేనే లేదు. ఇక పోతే భూమా అఖిల ప్రియ భవిష్యత్తు కి సంబంధించి కూడా గట్టి ప్రభావం కనపడుతోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డి ని గెలిపించుకోలేక పొతే రాజకీయంగా సన్యాసం చేస్తా అంటూ ఆమె శపథం కూడా చేసారు. ఈ నేప‌థ్యంలో శ‌క్తివంచ‌న లేకుండా పార్టీ నుంచి కూడా ఆమెకు సాయం అందుతోంది.


2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి భూమా కుటుంబాన్ని సొంత నియోజ‌క వ‌ర్గం ఆళ్ల‌గ‌డ్డ‌కు మాత్ర‌మే ప‌రిమితం చేయ‌బోతున్న‌ట్టుగా ఉంది. దానికి కారణం ఆళ్లగడ్డ లో భూమా, గంగుల కుటుంబాలకి వైరి వర్గం గట్టిగా ఉంది. భూమా టీడీపీ లో ఉన్న టైం లో గంగుల కుటుంబం కాంగ్రెస్ నుంచి పోటీకి వెళ్ళింది. భూమా నాగిరెడ్డి వైకాపా నుంచి టీడీపీ తీర్ధం పుచ్చుకునే సరికి గంగుల వైకాపా లో చేరారు. ఇప్పుడు అదే గంగుల వారు టీడీపీ కి వచ్చారు అనుకోకుండా. ఒకే ప్రాంతం లో రెండు కుటుంబాలు తలపడడం టీడీపీ కి ఉపయోగకరం కాదు. ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల‌పై ప‌ట్టు సాధించుకోవాలంటే… ఈ ఎన్నిక‌ల్లో అఖిల ప్రియ సోద‌రుడిని గెలిపించుకున్న మాత్రాన చాలదు.వచ్చే రెండేళ్లలో ఆళ్లగడ్డ లో ఉండి తన పట్టు పెంచుకోవాలి అఖిల ప్రియ.

మరింత సమాచారం తెలుసుకోండి: