ఒక పక్క నంద్యాల ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతూ ఉంటె మరొక పక్క కాకినాడ కార్పరేషన్ ఎన్నికల వేడి కూడా నెమ్మదిగా మొదలై సెగ రేగుతోంది.


తూర్పు గోదావరి జిల్లా నుంచి ప్రాతినిధ్య వహిస్తున్న చినరాజప్ప ని కాదు అని కాకినాడ ఎన్నికల బాధ్యతలు ప్రత్తిపాటి పుల్లారావు కి అప్ప జెప్పారు చంద్రబాబు దీని మీద టీడీపీ లో విసృతమైన చర్చ నడుస్తోంది.


కాకినాడ కార్పరేషన్ పరిథి లో దాదాపు నలభై ఎనిమిది డివిజన్ లలో టీడీపీ అభ్యర్ధులు బరిలో నిలుష్టున్నారు. వీరి ఎంపిక కోసం యనమల, కళా వెంకట్రావు , చినరాజప్ప లని తీసుకున్నారు.


 అలాగే ఈ ఎన్నికల ప్రచార బాధ్యతలు కూడా చినరాజప్పకే అప్పగించారు. అయితే సీట్ల కేటాయింపుపై పలువురు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేయగా, దానికి చినరాజప్ప దీటుగా సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. అలా జరగడం తో వెంటనే చినరాజప్ప ని పక్కకి పెట్టి ఆ బాధ్యత పుల్లరావు కి అప్పజెప్పారు. ఉప ముఖ్యమంత్రి కి సైతం షాక్ ఇస్తూ బాబు ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యకరం .

మరింత సమాచారం తెలుసుకోండి: