నంద్యాల ఉపఎన్నికను టీడీపీ, వైసీపీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ కంటే వైసీపీయే కాస్త ఎక్కువ దీనిపై దృష్టి పెట్టింది. 2014లో తమ చేతిలో ఉన్న ఈ స్థానాన్ని ఈసారి కూడా తమ ఖాతాలోనే వేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అయితే ఆ పార్టీకి అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          నంద్యాల ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి అక్కడ ప్రచారం ముమ్మరంగా ప్రారంభమైంది. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ అక్కడే మకాం వేసి ప్రచారం సాగిస్తున్నారు. 9వ తేదీ నుంచి జగన్ ప్రచారం మొదలైంది. ఆరంభంలోనే దూకుడు ప్రారంభించిన జగన్ అదే టెంపో మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబును నడిరోడ్డుపై నరికి చంపాలంటూ జగన్ చేసిన కామెంట్ సంచలనం సృష్టించింది. ఓ ముఖ్యమంత్రిని నరికి చంపాలనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే జగన్ ఏమాత్రం తగ్గలేదు. మరుసటి రోజే చంద్రబాబును ఉరితీసినా పాపం లేదని వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ కూడా తీవ్రంగా స్పందించింది.

nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          ఆ తర్వాత కూడా జగన్ మాటల వాడి తగ్గించలేదు. రోజుకో హాట్ కామెంట్ తో టీడీపీని టార్గెట్ గా చేసుకున్నారు. చంద్రబాబు ను దెయ్యంగా అభివర్ణించారు. దెయ్యాలు చెప్పే మాయమాటలను నమ్మొద్దని సూచించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ ఫిర్యాదు చేయడంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దీనిపై ఈసీ ఇంతవరకూ నిర్ణయం చెప్పలేదు. ఆ  నిర్ణయం  ఎలా ఉంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

jagan in nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          ఇదిలా ఉండగానే నంద్యాలలో వైసీపీ నేతలు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారు. ఆ పార్టీకి చెందిన 47 మంది కార్యకర్తలు, నేతలు డబ్బులు పంచుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమది విలువలతో కూడిన పార్టీ అని, ప్రలోభాలు పెట్టడం తమకు చేతకాదని చెప్తూ వస్తున్న వైసీపీ నేతలు తాజా డబ్బుల పంపిణీతో అడ్డంగా బుక్కయిపోయారు.

chandrababu container nandyal కోసం చిత్ర ఫలితం

          మరోవైపు సీఎం కంటెయినర్ లో కోట్లలో డబ్బు తీసుకువస్తున్నారంటూ వైసీపీ చేసిన హంగామా అంతాఇంతా కాదు. ఆ కంటెయినర్ ను అడ్డుకోవడం, మీడియా ముందే ఓపెన్ చేయాలని పట్టుబట్టడం.. చివరకు అధికారులు తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లడం.. అందులో కూరగాయలు తప్ప ఏమీ లేకపోవడం.. లాంటి చర్యలు వైసీపీని అప్రతిష్టపాలు చేశాయి.

jagan in nandyal bypoll కోసం చిత్ర ఫలితం

          పోలీసులు, ఎన్నికల అధికారులు కూడా వైసీపీ తీరుపై అసహనం వ్యక్తంచేశారు. ఏదైనా కచ్చితమైన సమాచారం ఉంటే తప్ప ఇలాంటి ఫిర్యాదులు చేయవద్దని వారు వైసీపీకి సూచించారు. ఇలా సమయం వృధా చేయడం సరికాదని వారు చెప్పారు. ఇలా ఒకదానికొకటి వైసీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో వైసీపీ విఫలమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: