నువ్వా నేనా అన్నట్టు సాగుతోంది నంద్యాల లో ఎన్నికల పర్వం. ఏ చిన్న విషయం లో కూడా తమ అవకాశాలు జార విరుచుకోకూడదు అని ఫీల్ అవుతున్నారు రెండు పార్టీల వాళ్ళూ.


నిజానికి టీడీపీ ఓవర్ ఆల్ గా కుమ్మేస్తుంది అనుకున్న ఈ ఎన్నికల్లో వైకాపా చాలా తీవ్రమైన పోటీని ఇస్తూ ఉండడం విశేషం. తిరుపతి నుంచి నంద్యాల చేరుకున్న చంద్రబాబు ఇవాళ అక్కడ ప్రచారం చెయ్యబోతున్నారు.


ఆయన రోడ్ షో కి అంతా సిద్దమైన వేళలో వర్షం చాలా తలనొప్పిగా మారింది. ఈరోజు అయ్యలూరిమెట్ట నుంచి నంద్యాల వరకు నాలుగు చోట్ల ముఖ్యమంత్రి రోడ్ షో జరగనుంది. దీనికితోడు, చర్చి పాస్టర్లతో కూడా చంద్రబాబు భేటీ కానున్నారు.


ఇదంతా ఓకే కానీ రోడ్ షో టైం లో వర్షం పడితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. రెండు రోజులగా జ్వరం తో ఇబ్బంది పడుతున్న చంద్రబాబు అలాగే తన పనిని కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు తప్ప ఎక్కడా రెస్ట్ తీసుకోలేదు. కీలకమైన నంద్యాల ఎన్నికలకి రెండు మూడు రోజులే గడువు ఉండడం తో ఎవరు చెప్పినా వినకుండా వర్షం లో అయినా రోడ్ షో కి సిద్దం అని తన వారితో చెప్పేసారు చంద్రబాబు. మరొక పక్క జగన్  ప్రచారం సంజీవ్ నగర్, రామాలయం, పెదబండ సత్రం ప్రాంతాలలో కొనసాగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: