భారత దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.  ముఖ్యంగా సమాజం పరిశుభ్రంగా ఉంటే..రాష్ట్రం..రాష్ట్రం శుభ్రంగా ఉంటే దేశం శుభ్రంగా ఉంటుందనే కాన్సెప్ట్ తో ‘స్వచ్ఛభారత్’ అనే కార్యక్రమం ప్రజల్లోకి తీసుకు వచ్చారు.  దీనికోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ వంతు కృషి చేయాలని సందేశం ఇచ్చారు.  ఇక దేశంలో నల్లధనం పేరుకు పోతుందని..నల్లధనాన్ని సమూలంగా నిర్మూలించేందుకు పెద్ద నోట్ల రద్దు చేశారు.
Image result for 500 2000 notes
 రూ.1000,500 స్థానంలో రూ.2000, 500 కొత్తనోట్లు తీసుకు వచ్చారు.  ఈ విషయంలో యావత్ భారత దేశంలో 50 రోజులు ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చారు.  ఆ మద్య రూ.200 నోటు కూడా ముద్రిస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం తాజాగా మార్కెట్ లోకి కొత్త రూ.50 నోటు తీసుకు వస్తున్నట్లు తెలిపింది.
Image result for కొత్త 50 నోటు
ఇక నోటు ముందు భాగంలో మహాత్మా గాంధీ ఫొటోతో పాటు దేవనాగరి లిపిలో 50 రూపాయలను సూచించే సంఖ్య, ఆర్బీఐ అని మైక్రోలెటర్స్‌, ఇండియా అన్న పదాలు రాసి ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. కుడివైపు భారత జాతీయ చిహ్నం, ఎలక్ట్రోటైప్‌ వాటర్‌ మార్క్‌, ఆరోహణ క్రమంలో నెంబరు ప్యానెల్‌ వుంటాయి.
Image result for కొత్త 50 నోటు
ఈ నోటు 66 ఎంఎం వెడల్పు, 135 ఎంఎం పొడవు ఉంటుందని ఆర్బీఐ తెలిపింది.   లేత నీలంరంగులో ఉన్న ఈ నోటు చూడటానికి ఆకర్షనీయంగా ఉంది.  మొత్తానికి భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ప్రతిబింబించేలా హంపీ రథంతో పాటు స్వచ్ఛ భారత్‌ లోగోను ఈ నోటు వెనుక భాగంలో ముద్రించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: