నంద్యాల ఉప ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు - ఒక నిరంకుశ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి సారధ్యం వహించే తెలుగు దేశం పార్టీకి గుణపాఠం చెప్పే అద్భుత అవకాశం మాత్రమే కాదు అనెక దుష్కార్యాలకు రూపురెఖలు ఇచ్చి బరితెగించిన అనేకమంది ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు ఒకరకమైన  "ఝలక్" ఇచ్చే రాజకీయ అవకాశం కూడా. సరైన ఝలక్ ఇస్తే ఇంకా మిగిలి ఉన్న ఒకటిన్నరేళ్ళ సమయములోనైనా ప్రభుత్వాన్ని బలవంతనానైనా పనిచేయించవచ్చు.  


విచ్చలవిడిగా ప్రజాప్రతి నిధులు తాము ఎన్నికైన పార్టీలకు రాజీనామా చేయకుండా స్వంత ప్రయోజనాలకోసం అధికార పార్టీలొకి మారటం - ఆ దుష్కాముకాన్ని ప్రోత్సహించి విచ్చలవిడితనానికి పునాదులు వేసిన అధికారపార్టీ నాయకత్వం కూడా గుణపాఠం ఈ ఎన్నికల ద్వారా నేర్చుకోవాలి. 


nandyal elections కోసం చిత్ర ఫలితం


దీనికి ఉదాహరణగా కేంద్ర ఎన్నికల కమిషనర్ ఓపి రావత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత ఫిరాయింపు రాజకీయాలకు అద్దంపడు తున్నాయి. అదికారపార్టీలోకి వస్తే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని, నేరాలన్ని సమసిపోతాయన్న అబిప్రాయం ఏర్పడింద ని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కొత్త దురాచారం ఒక రాజకీయ విదానంగా సంతరించుకుంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వేరే పార్టీ పతాకంపై గెలిచిన చట్ట సభల సభ్యులను తమవైపు తిప్పుకోవడం, డబ్బులు వెదజల్లి వారిని నయాన్నో బయాన్నో వారిని ఆకర్షించడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి బెదిరించో అదలించో  తప్పుడుపనులు చేస్తూ వాటిని తెలివైన రాజకీయ నిర్వహణగా అపర చాణక్యంగా చెప్పు కోవడం పరిపాటిగా మారిందన్నారు. వీటికి వ్యతిరేకంగా అంతా పోరాడాలని కూడా ఆయన సూచించారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎలక్టోరల్‌ బాండ్ల వల్ల ఎన్నికల వ్యవస్థ లోకి నల్లధనం ప్రవేశించే అవకాశం ఉందన్నారు. సామాజిక మాధ్యమం (సోషల్ మీడియా) ను తప్పుడు ప్రచారానికి వేదిక గా కూడా వాడుకుంటున్నారని,దీనిపై ఒక విధానం రూపొందించాలని ఆలోచిస్తున్నామని రావత్ తెలిపారు. ఇప్పుడు నంద్యాల్లో ప్రజలు తెలివిగా విఙ్జతగా వ్యవహరించి ఓటెస్తే కాగలకార్యం అతి సునాయాసంగా నెఱవేరుతుంది.



nandyal elections కోసం చిత్ర ఫలితం

 

ప్రతి దానికి ప్రతిపక్ష పార్టీ చేసిన తప్పులను చూపుతూ ఆ నీడలో బ్రతికి బట్టకడుతూ అవే తప్పులు అంతకన్నా పదిరేట్లు అధికార పార్టీ చేసిన చేస్తున్న దుష్కార్యాలకు రాజ్యాంగ ప్రతిష్ఠ మంటకలుస్తుండటానికి అడ్డుకట్టపడాలి.



అధికారులపై ముఖ్యంగా మహిళా ఉద్యోగులపై చేయిచేసుకుంటున్న అధికార పార్టీ ఎమెలేలు ఇతర ప్రజాప్రతినిధులే ప్రభుత్వ పాలనకు రాజ్యాంగ స్పూర్తికే దెబ్బకొడుతున్నారు.  



ఒక ఇరవై మంది అమాయక ప్రజల ప్రాణాలు హరించిన బస్ ప్రమాదానికి కారణమై, ఆ బస్ యాజమాన్యానికి బాసటగా నిలిచిన అధికారపార్టీకి ఒక్కసారైనా ప్రజలు బుద్దిచెప్పాలి. దానికిదే సరైన అవకాశం. 



అసలు నాడు అమరావతిలో చెలరేగిన కాల్-మని, కల్తీ మాఫియా, ఇసుక మాఫియా, భూ మాఫియా లాంటి కాలకేయులపై ప్రభుత్వం తీసుకున్న చర్యల దాఖలాలే కనిపించవు. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు వివరించా ల్సిన ప్రభుత్వం మౌనం వహిస్తుంది. సాధారణం గా ఈ సందర్భాల్లో మౌనం అంటే అపరాధాన్ని అంగీక రించటమే. అమరావతి లో జరిగిన భూసేకరణ విషయం అవినీతి తప్పిదాల మయమే అనితెలుస్తుంది. దాని పరిశీలనకు విచారణకు సుప్రీం కోర్ట్ అదేశాలివ్వటం ఇప్పటికే జరిగిపోయింది. 


nandyal elections కోసం చిత్ర ఫలితం


ఎన్నికల వాయిదాకు టిడిపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ప్రతిపక్షనాయకులు పసిగట్టినట్లే తెలుస్తుంది.  అందుకే నంద్యాల ప్రజలకు అద్బుతమైన అవకాశం వచ్చిందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నంద్యాలలో ఓడిపోతామన్న భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలు అని, ఇంకొకటి అని కొత్తపల్లవి అందు కున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలకు బదులు చెప్పే అవకాశం నంద్యాల ప్రజలకు అందరికన్నా ముందుగా వచ్చిందని, దీనిని నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు. 


నిజంగానే నంద్యాలలో శాంతి భద్రతల సమస్య ఉంటే అందుకు సంబందించి పోలీస్, కలెక్టర్ నివేదిక ఉంటే బయట పెట్టా లని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వద్ద పోలీసుల నుంచి వచ్చిన ఒక నివేదిక ఉందని, అదేమిటంటే నంద్యాలలో వైసిపి గెలుస్తుందని మాత్రమేనని శ్రీధర్ రెడ్డి అన్నారు. నంద్యాల ప్రజల ఆత్మగౌరవానికి ఇది ఛాలెంజ్ అని ఆయన అన్నారు.



nandyal elections కోసం చిత్ర ఫలితం


నంద్యాల ఉప ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ కూడా తన దైన రీతిలో  ప్రత్యేక శైలిలో వ్యవహరించటం కూడా ఈ ప్రభుత్వ తీరును ఎండగట్టటమే.  ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల పరిశీలకులుగా ప్రధానంగా ముగ్గురు అధికారులను నియమించింది ఎన్నికల కమిషన్ (ఈసీ).  సాధారణంగా ఒక పరిశీలకుడిని నియమిస్తారు.. అయితే నంద్యాల నియోజక వర్గానికి మాత్రం ఏకంగా ముగ్గురు పరిశీలకులను నియమించింది.  ఈ ఉప ఎన్నిక విషయంలో ఆది నుంచి ఈసీ దగ్గరకు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఓటర్ లిస్టులోకి ఇటీవలే చాలా ఎక్కువమందిని చేర్పించారనే ఆరోపణ వచ్చింది. నియోజక వర్గానికి సంబంధించని ఎంతో మంది పేర్లు ఓటర్ లిస్టులో నమోదయ్యాయనే ఫిర్యాదుపై స్పందించి, ఓటర్ లిస్టును పరిశీలించారు అధికారులు.ఇక పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నంద్యాల్లో ఫిర్యాదుల పరంపర తీవ్ర స్థాయికి చేరింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు ఈసీకి ఫిర్యాదు చేసుకొంటూ వస్తున్నాయి.


ఈ క్రమంలో నంద్యాల డీఎస్పీపై ప్రతిపక్ష పార్టీ  "ఆయన అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నాడు"  అని ఈసీకి ఫిర్యాదు చేసింది.  ఈసీ బదిలీవేటు వేయడం ఆసక్తికరంగా మారింది. పోలింగ్ కు మరో నాలుగు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో డీఎస్పీ గోపాలకృష్ణ‌ ను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఓఎస్డీ రవిప్రకాష్ కు బాధ్యతలను అప్పగించింది. ఈ నేపథ్యంలో ఈసీ ఆయనను బాధ్యతల నుంచి తప్పించింది.


అధికార తెలుగుదేశం అత్యహంకారానికి ఈ కొద్ది ఉదాహరణలు చాలు. మేమేసిన రోడ్లపై మీరు నడుస్తున్నారన్న అధికారపార్టీ నాయకుని అధికారమధాన్ని అణచివేసి ఎన్నికల్లో గుణపాఠం చెప్పి మిగిలిన సమయాన్నైనా సరైన పాలనకు వాడుకోకపోతే మీకు, మీ పార్టీకి పదవీచ్యుతే అని ప్రజలు బల్లగుద్ది ఈ ఎన్నికల ద్వారా చెప్పటం చాలా అవసరం.  



nandyal elections కోసం చిత్ర ఫలితం



ఈ ఎన్నికల ముఖ చిత్రం లో సానూభూతి పవనాల ప్రభావం అంతగా కనిపించటం లేదు. సానుభూతితో వారి వారసులను ఎన్నుకోవటం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలివ్వటమే. ఓటర్లు తమ వ్యక్తిత్వానికి ఆశలకు ప్రతీకైన ఓటును ఏదో ఏమోషన్ కు తలొగ్గి తాకట్టు పెట్టటమంటే తమ గోయి తాము త్రవ్వుకోవటమే. ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్దులు లెవరూ అంత అమాయకులు, నిరుపేదలు కాదు. తరతరాలకు సరిపడా ప్రజాధనాన్ని పోగేసుకున్నవారే. తల్లిలేదు తండ్రిలేదు మాకు దిక్కులేదు అంటూ అనటం ఒక బిక్షగాళ్ళ లక్షణం. వారికి నాలుగు పైసలెయ్యటం ధర్మం. కాని వీరు కోరేది మీ ఓటు. అంటే మీ వ్యక్తిత్వానికి మీ భవిష్యత్ కు ప్రతీక. సానుభూతికి తలొగ్గి ఈ రాజకీయబిక్షగాళ్ళకు మీరు ఓటేస్తే మీ వ్యక్తిత్వాన్ని భవిష్యత్ ను వాళ్ళకు ధర్మం చేసినట్లే. ఆ తరవాత ఈ బిక్షగాళ్ళ నిజస్వరూపం ఎలాఉంటుందో మనకందరికి ఏడు దశాబ్ధాల స్వాతంత్రం రుచిచూపిస్తూనే ఉంది. తస్మాత్ జాగ్రత్త అని మాత్రం నంద్యాల ఓటర్లకు విఙ్జప్తి మాత్రం ఈ సంపాదకీయం ద్వారా చేస్తున్నాం.    

nandyal elections కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: