భారతీయసైన్యం అనేక సాంకేతిక హంగులతో దినదిన ప్రవర్ధమానమౌతుంది. సరిహద్ధులలో ఇరు పొరుగు శతృదేశాలు యుద్ధానికి కాళ్ళు దువ్వుతున్న నేపద్యం మన సైన్యాన్ని సాంకేతిక పరిఙ్జానంతో అత్యంత అధునికీకరించవలసిన అవశ్యకతను కేంద్రప్రభుత్వం గుర్తించింది.    


Image result for robots to indian army



జమ్ముకాశ్మీర్‌ లో హింసాకాండ ను ఎదుర్కొవటానికి భారత సైన్యంలోకి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన కొత్తతరం రోబో లను విరివిగా ప్రవేశపెట్టాలని భారత రక్షణశాఖ నిర్ణయించింది. ఉగ్రవాదులతో, సంఘ విధ్రోహులతో సమర్థంగా పోరాడటానికి 544 రోబో లను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనకు ఇటీవలే ఆమోదం లభించింది. 


Image result for robots to indian army


"మేక్" కేటగిరీ కింద 2016 లోనే దీనికి సంబంధించిన ప్రక్రియను సైన్యం ప్రోద్భలంతో ప్రారంభించారు. "జమ్ము కాశ్మీర్‌లో ఎదురవుతున్న పరిస్థితి సాధారణమైంది కాదు. రాష్ట్రీయ రైఫిల్స్‌కు సున్నితమైన ప్రాంతాల్లో ముప్పు ఎదురవుతోంది" అని సైన్యం తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం మొదటి యూనిట్‌ తో పాటే రెండో యూనిట్‌ ను కూడా రిమోట్‌ తో ఒకే ఆపరేటర్ నిర్వహిస్తాడు. 


Related image


ఈ రిమోట్‌కు రెండు "డిస్-ప్లే స్క్రీన్‌" లను కలిగిఉంటాయి. తక్కువ బరువుండే ఈ రోబోలకు నిఘా కెమెరాలు కూడా అమరు స్తారు. 200 మీటర్ల దూరం వరకూ కెమెరా లు స్పష్టమైన చిత్రాలను తీయ గలుగుతాయి. ఐఈడి పేలుడు పదార్థాలను గుర్తించేందుకు రిమోట్‌ తో ఆపరేట్ చేసే వాహనాన్ని ఇటీవలే సైన్యంలో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.


Related image

మరింత సమాచారం తెలుసుకోండి: