చంద్రబాబు తో సహా తెలుగుదేశం పార్టీ అధినేతలు, మంత్రి మండలి గల్లి నాయకుల నుండి డిల్లీ నాయకుల వరకు అందరి దృష్ఠి నంద్యాల ఉప ఎన్నికపైనే కేంద్రీకరించటమే కాకకుందా అనేక కొత్త పదాకాలకు ఊపిరి పోసి,ఎన్నడూ నంద్యాల నోచుకోని అభివృద్దికి బాటలువేసి చేస్తున్న ఉప ఎన్నిక పోరటం మాత్రం ఇప్పటి వరకూ అనుకున్నట్టు 2019 ఎన్నికల రిఫరెండం కాదని తాజాగా ఒక కేంద్ర నాయకులవారే సెలవివ్వటం నంద్యాల జనాన్ని మొత్త రాష్ట్ర ప్రజలను ఆశ్చర్య చకితు లను చేసింది . అంటే దీనర్ధం ప్రభుత్వం ఈ ఎన్నికల నుండి అనర్ధం పోందబోతుందనే కదా?  



"నంద్యాల ఉప ఎన్నిక ఫలితం టీడీపీ ప్రభుత్వ పాలనకి రెఫరెండం కాదని" కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. నంద్యాల ఉపఎన్నిక చాలా చిన్నదని, దీన్ని రెఫరెండం గా తీసుకోవలసిన అవసరం లేనే లేదని ప్రవచించారు. విశాఖలోని టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఎన్నిక చిన్నదైనా, పెద్దదైనా రాజకీయ పార్టీగా గెలుపు కోసం తాము గట్టి పోటీ ఇవ్వాల్సి వస్తుందన్నారు. 


టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని ఉప ఎన్నికల్లో గెలిచామని, మరికొన్ని ఓడామని చెప్పారు. నంద్యాలలో అభివృద్ధి అవసరమని భావించి అక్కడ నిధులను ఖర్చు చేస్తున్నారన్నారు. ఉప ఎన్నిక జరుగుతున్నందుననే గెలుపు కోసం అభివృద్ధి అవసరమని భావించారా?  అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. 


ప్రధాన నగరాలు, పట్టణాల్లో గత మూడేళ్లుగా అభివృద్ధి జరుగుతోందన్నారు. ఒక్క నంద్యాలలోనే కాదు, రాష్ట్రంలో అవసర మనుకున్న చోట అనేక నియోజకవర్గాల్లో అవసరాన్నిబట్టి తమ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. 
నంద్యాల లో టీడీపీ నాయకులు ఓటర్లకు భారీగా డబ్బులు పంచుతున్నారన్న, వైసీపీ నేతల ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. వాస్తవాలను ఎన్నికల సంఘం చూసు కుంటుందని సుజనా చెప్పారు.


ఈ విషయం విన్న విఙ్జులు రాజకీయ నాయకులు కొందరు ఈయన పానకం లో పుడకలా మాట్లాడారని, ఈయన సెలవిచ్చిన అంశం గురించి ఆలోచిస్తూ,  "రాను రాను ఎన్నిక దగ్గరపడే కొద్దీ విజయంపై తెలుగుదేశం గుండెలు జారి పోతున్నాయని" వ్యాఖ్యానించటం గమనార్హం 


Image result for sujana chowdary campaigning

మరింత సమాచారం తెలుసుకోండి: