Image result for stone pelting at ladakh between india china border



వివాదాస్పద లడక్ సరిహద్దుల్లో 'పాంగాంగ్ లేక్' వద్ద భారత్ చైనా సైనికులు ఒక ఏభై మంది భారత స్వతంత్ర దినోత్సవం రోజున ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకున్న వీడియో ఒకటి మీడియా దృష్టికి వచ్చినట్లు తెలుస్తుంది. ఆ రోజు ఇరుపక్కలా ఉద్రిక్త వాతావరణం సృష్టించిన ఈ సంఘటనలో ఇరువర్గాలకూ గాయాలైనట్లు ఆ వీడియో ద్వారా తెలుస్తుంది. 


A screengrab of the video that purportedly shows Indian and Chinese soldiers pelting stones at each other.


ఈ ప్రదేశం అంతా లాడాక్ రీజియన్ కు చెందినదే. దీనికి సరైన కారణం "ఒకరిపై మరొకరు దృష్టి కేంద్రీకరిస్తూ ఎదురెదురుగా నిల్చున్న" డోక్లాం సరిహద్దుల "వాస్తవదీన నియంత్రణ రేఖ" వద్ద ఇరుసైన్యాలు ఉన్నప్పటి సందర్భంగా వీరిలో రగిలిన అల జడి ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తుంది. అయితే చైనా సైన్యాలు వాస్తవదీన నియంత్రణ రేఖను దాటి భారత్ భూభాగం లోకి చొచ్చుకొని రావటం దాన్ని భారత సరిహద్దు రక్షణ దళాలు ప్రశ్నించటం, ధీటుగా నిలువరించటం ఈ ఘర్షణకు దారితీసి నట్లు తెలుస్తుంది. ఇది అత్యంత సున్నితమైన ప్రదేసం కావటం ఈ లేక్ లో మూడింట రెండు వంతులు చైనా ఆదీనం లో ఉండటం ఈ ఘరషణకు ఒక కారణమని అంటున్నారు. 


Image result for stone pelting at ladakh between india china border


అయితే 72 సెకన్ల నిడివి ఉన్న వీడియో లో ఒక బలమైన రాతి ప్రదేశం ప్రక్క నుండి చిత్రీకరించినట్లు తెలుస్తుంది నేపద్యం లో మాత్రం అ సరస్సు లోని నీలి నీలి జలాల చివరి భాగం కనిపిస్తుందని తెలుస్తుంది. దీనిపై వ్యాఖ్యానించటానికి గాని, ఆ వీడియో ని నిజమైనదిగా నిర్ధారించటానికి కూడా సైన్యం నిరాకరించినట్లు తెలుస్తుంది. 


Image result for stone pelting at ladakh between india china border


మాజీ సైనికాధికారి ఒకరిని ఒక ప్రముఖ జాతీయ మీడియా సంప్రదించగా ఆ ప్రాంతం పాంగాంగ్ లేక్ తీరమేనని, అయితే రాళ్ళు విసురుకున్నది ఏ రోజో చెప్పలేనని ఆయన అన్నట్లు తెలుస్తుంది. దీనిపై కొందరు సైనికోద్యోగులు కుడా అలాగే స్పందించారు. 


ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇటీవల బయటకు వచ్చింది. కాగా, లడఖ్‌లో ఈ ఘటన జరిగినట్టు భారత్‌ ధ్రువీకరించిన విషయం తెలిసిందే.

       

మరింత సమాచారం తెలుసుకోండి: