ఉమ్మ‌డి తెలుగు రాష్ట్రాల్లో నంద్యాల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంది. దేశాన్నే ఏలిన‌వారంద‌రూ దాదాపుగా నంద్యాల నుంచి పోటీ చేసిన వారే ఎక్కువ‌.  ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ గా ఉన్న‌ప్పుడు నాటి దేశ రాష్ట్ర‌ప‌తి నీలం సంజీవ‌రెడ్డి, ప్ర‌ధాని పీవీ నర్సింహ్మారావు లు నంద్యాల నుంచి పోటీ చేసిన‌వారే. నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వర్గ‌మే కాదు, లోక్ స‌భ నియోజ‌క వ‌ర్గానికి కేంద్రంగా కొన‌సాగుతుంది. 


ఒక్క మాట‌లో చెప్పాలంటే దేశంలోని మ‌రే ఇత‌ర లోక్ స‌భ స్థానానికి  ఇటువంటి ప్ర‌త్యేకత లేదు. 1977 లో జ‌రి గిన ఎన్నిక‌ల‌లో మొత్తం 42 లోక్ స‌భ స్థానాల్లో ఒక్క‌టంటే ఒక్క‌టే ప్ర‌తిప‌క్షానికి ద‌క్కింది. జ‌న‌తా పార్టీ టిక్కెట్టు పైన  నంద్యాల‌లో  పోటీ చేసిన మాజీ ముఖ్య‌మంత్రి, మాజీ స్పీక‌ర్ నీలం సంజీవ‌రెడ్డి న‌ల‌బై వేల ఓట్ల మోజారిటీ తో గెలు పొందారు. 

త‌క్కిన 41 స్థానాల‌నూ కాంగ్రెస్ పార్టీ గెలు పొందింది. అనంత‌రం 1977 జూలై 21న సంజీవ రెడ్డి ఏక‌గ్రీవంగా రాష్ట్ర ప‌తిగా ఎన్నిక‌య్యారు. అధికార అభ్య‌ర్థి సంజీవ‌రెడ్డిని ఓడించిన ఇందిరాగాంధీ ఏక‌గ్రీవ ఎన్నిక‌కు స‌హ‌కరించ డం గ‌మ‌నించ‌దగ్గ విష‌యం. నంద్యాలనుంచి సంజీవరెడ్డి తర్వాత పెండేకంటి వెంకటసుబ్బయ్య ఎన్నికై ఇందిర మంత్రిమండలి లో హోం శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఏడేళ్ళ అనంతరం నంద్యాలకు మరో సారి మహర్దశ పట్టింది.

ఇక 1991 ఎన్నికలకు దూరంగా ఉన్న  పీవీ న‌ర్సింహ్మారావు  తమిళనాట శ్రీపెరంబదూరులో రాజీవ్‌గాంధీ హత్య జరగడం తో మైనారిటీ ప్రభుత్వ సారథిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత పార్లమెంటుకు ఎన్నిక కావలసి వచ్చింది. అప్ప‌టి ముఖ్య‌మంత్రి కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి నంద్యాల నుంచి గెలుపొందిన కాంగ్రెస్‌ ఎంపీ  గంగుల ప్రతాప రెడ్డి చేత రాజీనామా చేయించి పీవీని అక్కడ పోటీ చేయించారు.

ప్రధాని స్థాయికి చేరిన ఒక తెలుగు ప్రముఖు డికి పోటీ పెట్టకూడదని ఎన్టీఆర్‌ నిర్ణయించారు. ఫలితంగా పీవీ 5.8 లక్షల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు.  
1996లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పీవీ  నంద్యాల నుంచి తక్కువ మెజారిటీ తోనూ, బరంపురం నుంచి ఎక్కువ ఆధి క్యంతోనూ గెలిచారు. బరంపురం స్థానం ఉంచుకొని నంద్యాలను వదులు కున్నారు. నాటి నుంచి నంద్యాల ఎన్నిక‌లు ఎన్ని నాటకీయ ప‌రిణామాల మ‌ద్య జ‌రిగినా ఏనాడు కూడా ఏక ప‌క్ష ఫ‌లితాలు క‌న‌బ‌డ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: