ప్రస్తుతం దేశంలో హవా కొనసాగుతున్న పార్టీ బీజేపీ తప్ప మరొకటి లేదు. ఇందులో ఎవరికీ ఏమాత్రం సందేహాలు ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయాన్ని అంగీకరించి తీరాల్సిందే.! అయితే ఆ హవాను ప్రస్తుతానికి మాత్రమే పరిమితం చేసే ఉద్దేశం బీజేపీకి ఉన్నట్టు లేదు. ఎప్పుడొచ్చామన్నది కాదు... ఎంతకాలం ఉన్నామన్నదే ముఖ్యం.. అన్నట్టు బీజేపీ వ్యవహరిస్తోంది. తన భవిష్యత్ పై ఫుల్ క్లారిటీతో ఉంది.

Image result for bjp

          2014లో అమిత్ షా – మోదీ ద్వయం సంచలనం సాధించింది. బీజేపీని సొంతంగానే అధికారంలోకి తీసుకురాగలిగింది ఈ ద్వయం. 2019వరకూ ఈ ప్రభుత్వానికి సమయముంది. ఇప్పుడున్న పరిస్థితులను అంచనా వేస్తే మరోసారి అధికారంలోకి రావడం ఆ పార్టీకి పెద్ద కష్టం కాకపోవచ్చు. అంటే 2014 వరకూ మళ్లీ మోదీ సర్కార్ ఉంటుందనే అంచనాకు దేశం వచ్చేసింది. అయితే మోదీ – షా టార్గెట్ అంతవరకూ మాత్రమే కాదు. అంతకుమించిన భారీ టార్గెట్ ఉంది.

Image result for bjp

          2019 ఎన్నికల్లో గెలవడం మాత్రమే బీజేపీ లక్ష్యం కాదని ఆ పార్టీ అధినేత స్పష్టం చేశారు. “ ఐదు, పదేళ్లపాటు అధికారంలో ఉండడానికి మనం రాలేదు. వచ్చే 50 ఏళ్లపాటు దేశాన్ని పరిపాలించాలన్నదే బీజేపీ లక్ష్యం. 40-50 ఏళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడే దేశంలో పెద్ద మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అందరూ ముందుకు సాగాలి” అని అమిత్ షా దిశానిర్దేశం చేశారు.

Image result for bjp

          అంతేకాదు.. 2019లో 350 సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందనే ఊహాగానాలను కూడా అమిత్ షా కొట్టిపారేశారు. అంతకుమించిన సీట్లు సాధించాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్టు షా చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి ఆధిక్యం ఉంది. అయితే అది సరిపోదని.. మరింత కృషి చేయాలని ఆయన స్పష్టంచేశారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసేందుకు అమిత్ షా 110 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించారు. భోపాల్ నుంచి ఆయన దేశవ్యాప్త యాత్ర మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: