ఏపీ లో అధికార విపక్షాలు నంద్యాల ఎన్నిక ని ఎంత సీరియస్ గా తీసుకున్నాయో చెప్పాల్సిన పనే లేదు. ఎప్పుడూ లేనంతగా ఇక్కడే మకాం వేసి మరీ రెండు పార్టీల నాయకులూ గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు .మొదట్లో టీడీపీ కి సొంత గా వెళ్ళిపోతుంది అనుకున్న నంద్యాల ప్రాంతం ఇప్పుడు పూర్తిగా టఫ్ ఫైట్ నడుస్తోంది. అధికారం లో ఉన్న టీడీపీ ఈ ప్రాంతం లో హడావిడి గా కావాల్సినంత అభివృద్ధి చేస్తోంది. కోటానుకోట్ల నిధులని టీడీపీ సర్కారు గుమ్మరించింది. వైకాపా కి అధికారం లేకపోవడం తో ఇక్కడే కూర్చుని టీడీపీ చేసే పనులని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది.


ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి నంద్యాల లో దాదాపు పది రోజుల నుంచీ తిష్ట వేసారు. అయితే, ఇలాంటి ప‌రిస్థితుల్లో నంద్యాల ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి కేంద్ర‌మంత్రి, టీడీపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య చేశారు. నంద్యాల ఉప ఎన్నిక ని చిన్నగానే తాము చూస్తున్నాం అనీ టీడీపీ పాలన కి రిఫరెండం గా దీన్ని భావించడం లేదు అనీ అన్నారు ఆయన.


కేంద్ర మంత్రి , టీడీపీ లీడర్ ఇలా చెప్పడం ఆశ్చర్యకర విషయం. టీడీపీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు కూడా చాలా ఉప ఎన్నికలు వచ్చాయి అనీ కొన్ని ఓడి కొన్ని గెలిచిన ఘనత తమకి ఉంది అని ఆయన చెప్పడం విశేషం. నంద్యాలలో టీడీపీ నేత‌లు డ‌బ్బు పంచుతున్నారంటూ వైకాపా చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌న్నారు. ఆ వ్య‌వ‌హారం ఎన్నిక‌ల సంఘం చూసుకుంటుంద‌న్నారు. 


చంద్ర‌బాబు నాయుడి మూడున్న‌రేళ్ల పాల‌న‌కు వ్య‌తిరేకంగా ఓటు వెయ్యాలి అని ఒకపక్క వైకాపాగొంతు చించుకుంటూ ఉంటే ఇది రిఫరెండం కానే కాదు అని సుజనా అనడం వెనక మతలబు ఏంటి ? ఓడిపోతాం అనే భయం టీడీపీ చుట్టూ తిరుగుతోందా ? అందుకే ఇలాంటి వ్యాఖ్యలు రెండు రోజుల్లో ఎలక్షన్ అనగా వినిపిస్తున్నాయా ? 


మరింత సమాచారం తెలుసుకోండి: