అధికారంలో ఉంటే గెలుపు ఖాయంగా ఉంటుంద‌ని, ఏదైనా సాధించ‌వ‌చ్చున‌ని, ఓట‌ర్లు త‌ప్పని ప‌రిస్థితుల్లో అధికారంలో ఉన్న పార్టీకే గెలుపును క‌ట్ట‌బెడ‌తార‌ని భావిస్తే అది పొరపాటే అవుతుంది. గ‌తంలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలా చోటు చేసుకున్నాయి. అత్యంత భారీ మెజార్టీలో రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ పార్టీ సైతం ఎమ్మెల్సీ  ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాభావం చవిచూసింది.


అయితే ఇక్క‌డ చంద్ర‌బాబు సైతం ఇదే పాల‌సీని అవ‌లంబిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నిక జ‌రుగుతున్న నేప‌థ్యంలో హుటాహుటిన ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నారు. మూడేళ్ల‌లో  అమ‌లు కానీ ప‌థ‌కాలు కేవ లం 3 వారాలుగా ఊపందుకున్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఎత్తుగ‌డ‌లూ, వ్యూహాలూ భిన్నంగా ఉంటాయి. ఆయ‌నక సెంటి మెంట్లు, రాజ‌కీయ విలువ‌లు, నైతిక విలువలు ఉండ‌వు. 

గెలుపే ప్ర‌ధానంగా ముందుకు పోతుంటారని గ‌తంలో చాలా సార్లు రుజువైంది. ప్ర‌జ‌లు ఎన్నిక‌ల సమ‌యంలో ఇచ్చిన హామీల‌ను తీర్చాల‌ని ప‌ట్టుప‌ట్ట‌ర‌ని, ప్ర‌జ‌లు అమాయ‌కుల‌న్న విశ్వ‌సం చంద్ర‌బాబు కాస్త ఎక్కువే. ఈ విష‌యంలో ఆయ‌న న‌మ్మ‌కం ఇంత వ‌ర‌కూ ఎక్క‌డా వమ్ముకాలేదు. ప్ర‌తి రాజ‌కీయ నాయ‌కులు ఎన్నిక‌ల వేళ ఇచ్చిన హామీలను కాకుండా మ‌రో ర‌క‌మైన హామీల‌ను నెర‌వేరుస్తూ ఉంటారు.
 
కానీ చంద్ర‌బాబు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. ఇచ్చిన హామీల‌కు పూర్తిగా భిన్నంగా చేయ‌డం, ఇచ్చిన దానికి పూర్తి వ్య‌తిరేకంగా మాట్లాడ‌టం, దాన్ని స‌మర్ధించుకోవ‌డం చంద్ర‌బాబు ప్ర‌త్యేక‌త‌. తన మామ‌య్య ఎన్టీఆర్ ను గద్దేదించేందుకు ఆయ‌న చేసిన సాహసం, ఆయ‌న వెంట ఉంటూనే వెన్నుపోటు పొడిచిన తీరు తెలుగు ప్ర‌జ‌ల‌కు స‌ప‌రిచిత‌మే. ఎన్టీఆర్ మ‌ర‌ణానంత‌రం ఆయ‌న పొగ‌డ్తూ చేసిన ప్ర‌సంగాలు కూడా అంద‌రూ గ‌మ‌నించారు.


మొత్తానికి ఎన్టీఆర్ పోటో లేకుండా ప్రచారం చేసిన రోజులు దాదాపుగా లేవ‌నే చెప్పాలి. ఈ భావ‌న‌తోనే ప్ర‌జ‌లు రెండు సార్లు 1996, 99 అసెంబ్లీ పోరులోనూ విజ‌యం క‌ట్ట‌బెట్టారు. ఇదే ప్ర‌యోగం రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనూ కొన‌సాగించారు. ఒక వైపు రాష్ట్రాన్ని విభ‌జించ‌మ‌ని అప్ప‌టి రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ క‌మిటీకి లేఖ రాశారు. ఇదే స‌మయంలో ద‌మ్ముంటే విభ‌జిచాల‌ని సోనియాగాంధీని స‌వాల్ చేశారు.

తాను లేఖ ఇవ్వ‌పోతే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డికాద‌ని ఒక‌వైపు చెబుతూనే మ‌రోవైపు అన్యాయంగా, ఆశాస్త్రీయం గా కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభ‌జించారిని ఏపీలో మాట్లాడారు. త‌ప్పు చేసిన చాక చ‌క్యంగా త‌ప్పించుకునే నేర్ప‌రి త‌నం చంద్రబాబుకే స్వంతం. తెలంగాణ రాష్ట్రంలో  టీడీపీ క‌నుమ‌రుగౌంతుంద‌ని తెలిపిన ఆయ‌న ఓటుకు నోటు తెర తీశారు.

కానీ దుర‌దృష్ట‌వ శాత్తు పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొర‌కిపోగా...  చంద్ర‌బాబు మాత్రం ఆడియో టెపులో దొరికిపోయారు. నీతి నియాల గురించి ఆలోచించ‌ కుండా ఎక్క‌డ పోటీ జ‌రిగితే  అక్క‌డ ఉండాలి, ఏం చేసిన ప‌ర్వాలేదు కానీ గెలుపు స్వంతం చేసుకోవాల‌న్న స్వ‌భావం చంద్ర‌బాబుది. ఎలాంటి త‌ప్పు చేసినా ఏదో ఒక రకంగా త‌ప్పించుకునే చాక‌చ‌క్య‌త చంద్ర‌బాబు కు స్వంతం.

మరింత సమాచారం తెలుసుకోండి: