వైకాపా మీదా ఆ పార్టీ నేత జగన్ మీదా విరుచుకుపడ్డం బాగా అలవాటు ఉన్న ఒక టీడీపీ మంత్రి ఇప్పుడు జగన్ మీద వింత కామెంట్ లు చేసారు అని తెలుస్తోంది . " చిన్న వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కి జగన్ భలే చమటలు పట్టిస్తున్నాడే " అంటూ ఆయన మాటలు సాగాయి అంటున్నారు.


మీడియా లో వస్తున్న ఈ కథనం ప్రకారం సామాజిక అనుబంధం కారణంగానే ఆ మంత్రి నోట్లోంచి జగన్ మీద పాజిటివ్ మాట వచ్చింది అనే ప్రచారం నంద్యాల లో జరుగుతోంది.


జగన్ తో పాటు రోజా కూడా సమర్ధవంతంగా ప్రచారం చేస్తున్నారు అని ఆ మంత్రి తన మీడియా మిత్రుల దగ్గర వ్యాఖ్యానించారట.


టీడీపీ పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుంది అని లెక్కేసుకున్న నంద్యాల ఉప ఎన్నిక ప్రాంతం లో వైకాపా ఇస్తున్న ఫైట్ కి ఆ మంత్రి ఫిదా అయినట్టు సమాచారం .. రోజా దూకుడు ముందర తమ టీడీపీ శ్రేణులు ఎలాంటి సమాధానం ఇచ్చినా సరిపోవడం లేదు అనే కితాబు ఇచ్చారట మంత్రుల్లో అచ్చెంనాయుడు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఇతర నేతల్లో వర్లరామయ్య తప్ప వైసీపీకి ధీటుగా జవాబిచ్చేవారికే కొరత ఏర్పడిందని టిడిపి నేతలు వాపోవవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: