ప్రతీ నేలా దాదాపు మూడు వరాలు గృహ నిర్భంధం లో ఉంటున్నారు ముద్రగడ.. ఈ సారి అయితే ఏకంగా నెల రోజులు పూర్తిగా నిర్భంధం లో ఉన్నట్టు కనిపిస్తున్నారు ఆయన. కాపుల రిజర్వేషన్ ల విషయం లో ఛలో అమరావతి పాదయాత్ర ని గత నెలలో ఆయన తలపెట్టారు.


అప్పటి నుంచీ కిర్లంపూడి లో పోలీసుల పహారా జురుగుతూనే ఉంది. ప్రతీ రోజూ ఉదయం పాదయాత్ర కోసం బయలు దేరడం పోలీసులు అడ్డుకోవడం గృహ నిర్బంధం చెయ్యడం ఇది ఆయన దిన చర్య. అడుగు కూడా కదిలే పరిస్థితి లేకపోయినా ఇంకా పాదయాత్ర చేస్తా అని ఆయన ఓపెన్ గా చెబుతున్నారు. తన పట్టుదల సంగతి చంద్రబాబు కి తెలీదు అనీ తాను త్వరలో చాలా పెద్ద ఉద్యమం తీసుకుని రాబోతున్నా అంటున్నారు ఆయన.


అయితే దీనికి సంబందంచి కొత్త రకం వ్యూహం మార్పులకి సంబంధించి ముద్రగడ పెద్ద ఎత్తున ఉభయ గోదావరి జిల్లా అభిమానులతో మాట్లాడారు. ఆదివారం ఆయన కోసం చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులకి వ్యతిరేకంగా వీరంతా పెద్ద పెద్ద నినాదాలు కూడా చేసారు. మొత్తం మీద ముద్రగడ గృహ నిర్బంధం కొన్నాళ్ళ పాటు సాగేడట్టు గానే కనిపిస్తోంది.


దీంతో ఓ కాపుల ఉద్య‌మాన్ని ప్ర‌త్యామ్నాయ మార్గాల్లో న‌డిపించాల‌ని ముద్ర‌గ‌డ ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ వ్యూహాన్ని కాపు జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ అమలు చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది.నియోజికవర్గాల వారీగా సీరియస్ నిరసనలు చెయ్యాలి అనీ రాస్తా రోకోలో చెయ్యాలి అనీ ప్రెస్ మీట్ లు పెట్టి రిజర్వేషన్ విషయం లో ఏపీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని జనం లోకి తీసుకుని వెళ్ళాలి అనేది కొత్త వ్యూహం గా చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: