నంద్యాల లో ఎన్నికల పర్యటనలు చేస్తున్న చంద్రబాబు , జగన్ మోహన్ రెడ్డి తమదైన స్టైల్ లో డిఫరెంట్ గా ప్రచారం చేసే పనిలో బిజీ అయిపోయారు. మామూలుగా ఎన్నికల ప్రచారం అంటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభ కి జనాలని తరలించడం పరిపాటి.


లేదా రోడ్ షో నిర్వహిస్తూ ప్రజలు అందరినీ కలుస్తూ ఉంటారు అదొక మార్గం. ఇప్పుడు చంద్రబాబు మూడవ స్టైల్ లో వెళుతున్నారు. అదెలా అంటే కులాల వారీగా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం! నంద్యాలలో సీఎం ప‌ర్య‌ట‌న ఇలానే సాగింది.


మైనారిటీల‌తో సీఎం స‌మావేశ‌మై, వారి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆ తరవాత బలిజ జనాలతో భేటీ అయిన ఆయన కాపులు, బ‌లిజ‌, ఒంట‌రి, తెల‌గ కులాల అభివృద్ధికి తెలుగుదేశం ప్ర‌భుత్వం కట్టుబ‌డి ఉంద‌ని చెప్పారు .


కాపు కులానికి ప్రత్యేకంగా రిజర్వేషన్ లు ఏర్పాటు చేసే ప్రక్రియలోనే టీడీపీ ప్రభుత్వం ఉంది అనీ ఈ విషయం లో భవిష్యత్తు లో రిజర్వేషన్ లకి సంబంధించి ఇతరులు ఎవరూ అభ్యంతరాలు చెప్పకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది అనీ అందుకే ఈ విషయం లేట్ అవుతోంది అనే అన్నారు ఆయన. మంజునాథ క‌మిష‌న్ రిపోర్టు త్వ‌ర‌లో వ‌స్తోంద‌నీ, కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇవ్వ‌బోతున్నామ‌ని సీఎం అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: