నంద్యాల పోరు రసకందాయం లో పడింది. తాము గెలుస్తాం అంటే తాము గెలుస్తాం అంటూ టీడీపీ - వైకాపా ఫుల్ కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్న టైం లో ఎవరికి వారికి సేపెరేట్ గా అభద్రతా  భావాలు ఉన్నాయి అనే చెప్పాలి.


జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ లేనట్టుగా పది రోజులు నంద్యాల లో మకాం వెయ్యడమే దీనికి ఉదాహరణ. రెండు రోజులు పూర్తిగా చంద్రబాబు ఇక్కడే ఉండిపోవడం చూస్తోంటే ఈ సీటు మీద ఆయన కూడా ఎంత సీరియస్ గా ఉన్నారు అనేది అర్ధం అవుతోంది.


శాసన మండలి కి ముస్లిం చైర్మన్ ని చేస్తామని చెప్పాడా ద్వారా ఫరూక్ కి పదవీ ప్రసాదం చేసినట్టు అయ్యింది. కౌంట్ డౌన్ దగ్గర పడ్డం తో ట్యూన్ మార్చి ఇలాంటి పదవీ బంపర్ ఆఫర్ లు ఇవ్వడం మొదలు పెట్టారు ఇరు పక్షాల వాళ్ళూ.


మరొక పక్క డబ్బులు పంచడం, బెట్టింగ్ కేసుల లో వైకాపా , టీడీపీ శ్రేణులు ఇరుక్కుంటూ ఉన్నాయి. మరోవైపున ముఖ్యమంత్రి ప్యాంట్రీ కారును తనిఖీ చేయడమేమిటని ఎన్నికల సంఘానికి టిడిపి ఫిర్యాదు చేసింది. అయితే ఇవన్నీ వున్నా విధుల నిర్వహణ సరిగా లేదని డిఎస్‌పి గోపాలకృష్ణను ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: