రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచీ తనకి రెండు కోర్కెలు ఉన్నాయి అన్నారు వెంకయ్య నాయుడు. ఉప రాష్ట్రపతి గా వెళ్ళిన తరవాత మొదటిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన పౌర సన్మాన కార్యక్రమం లో మాట్లాడారు.


తెలుగు భాషకి సంబంధించి అనేక విషయాలు చెప్పుకొచ్చిన ఆయన మన భాష లో గ్రామర్ మాత్రమే కాదు అనీ గ్లామర్ కూడా ఉంది అనీ అన్నారు. ఇదే సందర్భంలోే తాను ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రుల నుంచి రెండు కోర్కెలను ఆశిస్తున్నట్టు చెప్పారు.


సమస్యలను ఇద్దరూ కలసి మాట్లాడుకుని పరిష్కరించుకోవడం అందులో ఒకటి గా పేర్కొన్నారు. తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వడం రెండోదని చెప్పారు.


ఇంగ్లిష్ అనే జబ్బు మనల్ని చాలా కాలం గా పట్టి పీడిస్తోంది అనీ అది పోవడం అంత తేలికైన విషయం కాదు అనీ అన్నారు వెంకయ్య " అది ఒక అంటు వ్యాధి లాంటి భాష , ఇంగ్లిష్ కి నేను వ్యతిరేకం కాదు ఒక దేశానికి ఉపరాష్ట్రపతి గా ఉన్న నాకు దాని గొప్పతనం తెలుసు. అంతర్జాతీయ వేదికలపై, రాజ్యసభ చైర్మన్ గానేనూ ఇంగ్లీష్ లో మాట్లాడతాను " అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: