అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ బెంగళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె అక్కడ రాజభోగాలు.. కాదు కాదు.. రాణిభోగాలు అనుభవిస్తోందంటూ గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే జైలు అధికారులు, ప్రభుత్వం వాటిని తిప్పికొట్టి.. విచారణకు ఆదేశించింది. అయితే ఇంతలోనే మరోసారి శశికళ రాణిభోగాలు బయటపడ్డాయి.

 Image result for sasikala jail

బెంగళూరు జైలులో శశికళ రాణిభోగాలు అనుభవిస్తోందంటూ మాజీ డీఐజీ రూప మొదట వెలుగులోకి తెచ్చారు. రూప ఆరోపణలను తిప్పికొట్టిన జైళ్ళ శాఖ ఉన్నతాధికారులు ఆమెపై బదిలీవేటు వేశారు. అయినా రూప వెనక్కి తగ్గకపోవడంతో శశికళ అంశానికి సంబంధించి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. ఇంతలోనే రూప మరో సంచలనం బయటపెట్టింది.

 Image result for sasikala jail

శశికళ తన బంధువు ఇళవరసి ఓ రోజు జైలు నుంచి బయటికెళ్లారని, బెంగళూరులో షాపింగ్ చేశారని రూప బయటపెట్టారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా ఆమె బయటపెట్టారు.  జైలు మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటికెళ్లడం.. ఆ తర్వాత అదే గేట్ నుంచి లోపలికి రావడం.. సీసీ టీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరూ జైలు దుస్తుల్లో కాకుండా సాధారణ దుస్తుల్లో ఉండటం... శశికళ వెంట ఓ బ్యాగ్‌ ఉండటం దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. బెంగళూరు ఎంజీ రోడ్డులో బుర్ఖా వేసుకుని శశికళ షాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధంచి సీసీ టీవీ ఫుటేజ్ కూడా ఉన్నట్టు సమాచారం.

 Image result for roopa dig

రూప అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ జైళ్ల శాఖ అధికారులు ఆరోపించిన నేపథ్యంలో ఆమెను ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేశారు. అయితే ఆమె వెనక్కు తగ్గకపోవడంతో ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు ఏసీబీకి రూప ఈ సీసీ టీవీ దృశ్యాలను అందించింది. తనవి ఆరోపణలు కాదని... జైలు అధికారులు లంచాలు తీసుకుని శశికళకు సహకరిస్తున్నారని రూప ప్రూవ్ చేసింది. మరి దీనిపై ఏసీబీ, ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: