తమిళ రాజకీయం మామూలు హాట్ గా లేదు. జయలలిత చావు తరవాత బొంగరాలు తిరుగుతున్న అక్కడి పరిస్థితులు ఇప్పుడు మరింత ముదిరి పాకాన పడ్డాయి. క్షణం కూడా ఒకరితో ఒకరికి పడని పన్నీర్ సెల్వం - పళని స్వామి ఇద్దరూ కలిసిపోయి విలీనం కావడం మీద ఇతర పక్షాలు సీరియస్ అవుతున్నాయి.


డీఎంకే నేత స్టాలిన్ తో పాటు డీఎంకే లో చేరుతాడు అని ఊహిస్తున్న కమల్ హాసన్ సైతం తీవ్ర స్థాయి లో అన్నా డీఎంకే మీద విరుచుకుని పడ్డారు. ధర్మ యుద్ధం అంటూ ఇన్నాళ్ళూ కహానీలు చెప్పి అనాలని మోసం చేసారు అని అన్నా డీఎంకే నేతలని విమర్శించారు కమల్ హాసన్.


పదవుల కోసం పాకులాడడమే ధర్మ యుద్ధమా? అని ఆయన ప్రశ్నించారు. పదవులు దక్కడంతో ఇక ధర్మయుద్ధం ముగిసిందా? అని ఎద్దేవా చేశారు.  పళని స్వామి - పన్నీర్ సెల్వం ల కంటే గొప్ప నటులు తమిళ రాష్ట్రం లోనే లేరు అని స్టాలిన్ విమర్శించారు.


తన ట్విట్టర్ ఖాతా లో కమల్ హసన్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.  ‘గాంధీ టోపీ.. కాషాయ టోపీ... కాశ్మీర్ టోపీ.. ఇప్పుడు ఫూల్స్ టోపీ.. ఇది చాలదా?’ అని ఆయన ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: