సౌత్ ఇండియా మీద ఫుల్ గ్రిప్ తెచ్చుకుని అంతా కాషాయమాయం చేసెయ్యాలి అనే ఉద్దేశ్యం తోనే పావులు కదుపుతోంది బీజేపీ పార్టీ. ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంతం లో సైతం తన ఉనికిని చూపిస్తూ ఈ రాష్ట్రం మీద ఒక కన్నేసి ఉంచారు .


ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టి కాంగ్రెస్ , టీడీపీ, తెరాస ల నుంచి వీలైనంత మందిని తమ పార్టీ లో చేర్చుకోవాలి అనేది బీజేపీ మాస్టర్ ప్లాన్. రాబోయే ఎలక్షన్ లో అంటే 2019 కల్లా తెరాస కి బీజేపీ నే ప్రత్యామ్న్యాయం అనిపించుకోవాలి అనేది బీజేపీ ముందర ఉన్న అతిపెద్ద లక్ష్యం.


మ‌రి, ఈ ప‌రిణామాల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ చూస్తూ ఊరుకుంటున్నారా..? కేంద్రంలో భాజ‌పాతో చెలిమి కోసం చూస్తుంటే… రాష్ట్రంలో అదే పార్టీ తెరాస‌కు ప్ర‌త్య‌ర్థిగా ఎదిగేందుకు పునాదులు వేసుకుంటున్న ప‌రిస్థితిని కేసీఆర్ అర్థం చేసుకునే ఉంటారు క‌దా! వచ్చే ఎన్నికల్లో కాదు కానీ 2024 లో మాత్రం బీజేపీ తెరాస కి తలనొప్పిగా మారుతుంది.


ఆ సంవత్సరం ఎన్నికల్లో అధికారం ఎక్కాలి అనే టార్గెట్ ని పెట్టుకునే అమిత్ షా ఇప్పటి నుంచే పావులు కదుపుతూ ఉన్నారు. ప్రస్తుతం మాత్రం తెలంగాణా లోని ఆరు పార్లమెంట్ స్థానాల మీద బీజేపీ గురి పెట్టింది. భువ‌నగిరి, చేవెళ్ల‌, మ‌ల్కాజ్ గిరి, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌, జ‌హీరాబాద్‌… ఈ ఎంపీ స్థానాల‌పై భాజ‌పా ఎక్కువ‌గా ఆశ‌లు పెట్టుకుంటున్న‌ట్టు స‌మాచారం. వీటిల్లో ప్రతీ స్థానం మీదా పట్టు రావాలి అంటే ఏం చెయ్యాలి ఇలా వ్యూహాత్మకంగా రచన చేస్తోంది బీజేపీ. కెసిఆర్ సైతం ఈ పరిస్థితి మీద ఒక కన్ను వేసి ఉంచారు అని అంటున్నారు విశ్లేషకులు. కేంద్రం లో దోస్త్ గా ఉంటూనే రాష్ట్రం లో బీజేపీ కి ఎలాగైనా అడ్డం పడాలి అని వ్యూహరచన చేస్తున్నారు ఆయన. 

మరింత సమాచారం తెలుసుకోండి: