అన్నా డీఎంకే లో హాట్ హాట్ రాజకీయాలు మొదలు అయ్యాయి. ఎవరి ప్రోద్బలమో ఏమో కానీ తమిళనాడు లో తీవ్రమైన రాజకీయ అలజడి మొదలైంది. పన్నీర్ సెల్వం, పళని స్వామి ఇద్దరి కలయికా మీడియా కి కావాల్సినంత వార్తలు అందిస్తోంది కూడా.


అయితే వీరి విలీనం విషయం లో అన్నా డీఎంకే ఆపార్టీ నేత దినకరన్ ఇచ్చిన స్పష్టమైన ప్రకటన ప్రకారం చెల్లదు అంటున్నారు. గవర్నర్ ని కలిసిన దినకరన్ ఆయనకి విషయం అంతా చెప్పి ఫిర్యాదు కూడా చేసారు.


" నా దగ్గర 25 మంది ఎమ్మెల్యే లు ఉన్నారు. ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో కూడా తెలీదు అలాంటి పరిస్థితి లో వారి విలీనం ఎలా చెల్లుతుంది? అసలు వారిద్దరూ విలీనం అవ్వడం ఎమ్మెల్యే లకి ఇష్టం కూడా లేదు.


విలీనం మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నవారు అందరూ నాతో కలుస్తున్నారు. గవర్నర్ కి కూడా ఇదే చెప్పేసాం. అవసరం అయితే ఈ ప్రభుత్వాన్ని పడేస్తాం" అన్నారు దినకరన్ 

మరింత సమాచారం తెలుసుకోండి: