నంద్యాల ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అప్పటికే చాలా బూత్ ల దగ్గర ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ ప్రారంభం కాకముందే ఓటర్ల స్పందన చూసి పరిశీలకులు సైతం నివ్వెరపోయారు. సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది.

Image result for nandyal bypoll

          నంద్యాలలో మొత్తం 2,18,858 మండి ఓటర్లున్నారు. ఇదే ఉత్సాహం రోజంతా కనిపిస్తే 90 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం ఖాయమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 72.09 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ 73.84 శాతం మాత్రమే. అయితే ఈ ఉపఎన్నికలో మాత్రం పోలింగ్ 90 శాతానికి ఏమాత్రం తగ్గబోదని అంచనా వేస్తున్నారు.

Image result for nandyal bypoll

          నంద్యాల ఉపఎన్నిక బందోబస్తు నిమిత్తం ఎన్నికల సంఘం 3500 మంది పోలీసులను మోహరించింది. 10 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ కూడా రంగంలో ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు జరగకుండా ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఎన్నికల సంఘం తీసుకుంది.

         


మరింత సమాచారం తెలుసుకోండి: