టీడీపీ గుండాల దాడి.. తోపులాటతో భయాందోళనకు గురైన ఓటర్లు. చోద్యం చూస్తూ నిలబడిన పోలీసులు.


 నంద్యాలలోని గాంధీనగర్‌లో డబ్బులు పంచుతోన్న టీడీపీ నేత అన్న రాంబాబు అనుచరులు.. అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు. 


 నంద్యాల ఉప ఎన్నికలో ఇప్పటికే సుమారు 65 శాతం వరకు పోలింగ్ జరిగిందని టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి అన్నారు. 


 ఈ ఎన్నికల్లో 80 శాతం వరకూ పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని ఇరు పార్టీ నేతలు అభిప్రాయ పడుతున్నారు. 


 కొన్ని చోట్ల ఏవీఎంలు మొరాయించడంతో గంట సేపు ఆలస్యమైందని, మిగతా చోట్ల చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు.


 ఓటర్‌ స్లిప్‌తో పోలింగ్‌ కేంద్రానికి వచ్చిన లక్ష్మమ్మను  ఓటర్‌ లిస్టులో పేరు లేదంటూ వెనక్కి పంపారు. కళ్లెదుటే నిల్చున్న లక్ష్మమ్మను పట్టుకొని చనిపోయావంటూ పోలింగ్‌ సిబ్బంది చెప్పడంతో ఆ వృద్ధురాలు షాక్‌కు గురైంది.     


 నంద్యాలలోని నందమూరి నగర్‌లో 10 మంది టీడీపీ దొంగ ఓటర్లను ఎన్నికల పరిశీలకులు పట్టుకున్నారు. విచారణ కోసం వారిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. 


 రికార్డు స్థాయి పోలింగ్‌ దిశగా దూసుకెళ్తున్న నంద్యాల♦పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితిని స్వయంగా వెళ్లి తెలుసుకుంటున్న శిల్పా మోహన్‌ రెడ్డి.


  దాదాపు 90 వరకు సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో పారా మిలటరీ బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు.


 పటిష్ట బందోబస్తు మధ్య నంద్యాలలో పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని చెప్పారు రాయలసీమ రేంజ్ ఐ.జి. మహ్మద్ ఇక్బాల్ తెలిపారు. ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారని చెప్పారు. 


 మధ్యాహ్నం 1గంట వరకూ 53.1 శాతం పోలింగ్‌ నమోదు, ఒంటి గంట వరకూ పోలైన ఓట్లు లక్షా 16వేల 214, పోలైన ఓట్లలో మహిళలు 59,954, పురుషులు 56,260


 స్థానికేతరులు జిల్లాలో ఉండొద్దని ఈసీ ఆదేశించినా పట్టించుకోని వైనం, యథేచ్చగా ఓటర్లపై ఒత్తిడులు, ప్రలోభాలు, అధికార పార్టీ ప్రలోభాలపై నిస్తేజంగా పోలీసు యంత్రాంగం


టీడీపీ కౌన్సిలర్‌ భర్త ప్రసాద్‌ హల్‌చల్‌ 27వ వార్డులో కౌన్సిలర్‌ హారిక, ప్రసాద్‌ అధికార దుర్వినియోగం


 నంద్యాలలోని 84, 85, 86 బూత్‌లలో టీడీపీ రిలీవింగ్‌ ఏజెంట్ల హల్‌చల్‌


 నంద్యాల గాంధీచౌక్‌లోని 61వ బూత్‌లో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు.


 నిఘా నీడలో కొనసాగుతోంది నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్. భారీ బందోబస్తు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ బందోబస్తుతో పాటు.. నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. 


 39 పోలింగ్‌ సెంటర్లలో ఓటింగ్‌ సవ్యంగా జరుగుతుందన్నారు. సమస్యాత్మకమైన గ్రామాలు  పోలీసులు భారీగా మోహరించినట్లు  తెలిపారు.  


 నంద్యాలలో అన్ని చోట్ల పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు. 


—  నంద్యాల పట్టణంలోనే పోలింగ్ కొంత మందకొడిగా సాగుతుండగా, నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో ఓటింగ్ మధ్యాహ్నానికే పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు ఇంతవరకూ చోటు చేసుకోలేదు.


 ఓటింగ్ ప్రారంభమై నాలుగు గంటలు గడువగా, ఇప్పటికే చాలా చోట్ల 40 శాతం, కొన్ని చోట్ల 50 శాతానికి పైగా ఓట్లు పోల్ అయ్యాయని అధికారులు వెల్లడించారు. వెల్లువెత్తిన ఓటర్లను చూస్తుంటే 80 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావచ్చని ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు.


 ఉదయం 10 గంటల వరకు 25 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, రామకృష్ణ విద్యాలయంలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. బొమ్మల సత్రంలోని ప్రాథమిక పాఠశాలలో నంద్యాల ఎంపీ ఎస్సీవై రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు


- ఓటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్న ఎన్నికల సంఘం


— ఉదయం 11.00 గంటల వరకు 33 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. 


 గోస్పాడు మండలం దీబగుంటలో వైఎస్‌ఆర్‌ సీపీ నేత పీపీ నాగిరెడ్డి బంధువులను అరెస్ట్‌ చేయాలని ఒత్తిడి


 ఉప పోరులో వైసీపీ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఆపార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌ రెడ్డి. 


— చంద్రబాబును రోడ్డుపై కాల్చేయాలని ఓ సందర్భంలో... ఉరి తీయాలని మరో సందర్భంలో కామెంట్స్‌ చేశారు. జగన్‌ కామెంట్స్‌పై టీడీపీ ఎంపీలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో జగన్‌ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.


 ఈ నెల 28 న  నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు 


నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్‌లో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. 19వ బూత్ నందమూరి నగర్‌లో మొరాయించిన ఈవీఎం.. 94వ బూత్ నంద్యాల ఎన్.జి.ఓ. కాలనీలో మొరాయింపు177వ బూత్ బ్రహ్మాణపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి.




 ఇప్పటివరకు తెలుగు దేశం ప్రభుత్వం, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పారు. ఏది ఏమైనప్పటికి ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వైసీపీ విజయఢంకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 


పూలూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అధికారిగా నియమించబడ్డ శ్రీనివాసరెడ్డికి ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. పోలింగ్ ప్రారంభమైన గంట సేపటి తరువాత హఠాత్తుగా కుప్పకూలి పోయారు. వెంటనే అక్కడున్న పోలీసు సిబ్బంది ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి స్థానంలో మరో పోలింగ్ ఆఫీసర్ ను నియమించనున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.


- ఓటింగ్ టర్నవుట్ ను బట్టి తమ విజయావకాశాలు అంచనా వేస్తున్న పార్టీలు 
 

-  పోలింగ్ ఏజెంట్లను ప్రలోభ పెడుతున్నట్లు వైసీపీ ఆరోపణ.


- టీడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి సోదరులపై వైసీపీ ఆరోపణలు.  పోలింగ్ బూత్ లోకి వెళ్లి టీడిపీకీ ఓట్లు వేయాలని సూచిస్తున్నట్లు భూమా నాగ మౌనికపై వైసీపీ ఆరోపణ 


- ఉప ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.  టిడిపి నుంచి బ్రహ్మానందరెడ్డి, వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి అబ్దుల్ ఖాదర్


 ఇక యువ ఓటర్లు అధికంగా కనిపిస్తుండటం తమకు లాభం కలిగిస్తుందని వైకాపా చెబుతుండగా, తమకే లాభమని టీడీపీ వర్గాలు అంటున్న పరిస్థితి. 

- ఈ ఎన్నికల్లో తొలిసారిగా తెలుగు రాష్ట్రాలకు వీవీపాట్ యంత్రాలు పరిచయం అవుతుండగా, తాము ఎవరికి ఓటేశామో చూసుకుంటుంటే ఆనందంగా ఉందని ఓటర్లు వ్యాఖ్యానించారు. 

- దేశంలోనే మొట్టమొదటి సారిగా పోలీసులు బాడీ ఓర్మ్ కెమెరాలను వినియోగిస్తున్నారు. వాటితో పాటు మూడు డ్రోన్ కెమెరాలను కూడా వాడుతున్నారు.  

- ఈ ఉపఎన్నికల్లో గడువులోగా లైన్లలో నిల్చున్నవారికి ఎంత ఆలస్యమైనా.. ఓటుహక్కు వినియోగించుకునేందుకు అనుమతిస్తామని ఈసీ పేర్కొంది. అయితే 6 గంటల తరువాత మాత్రం లైన్లలోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. 

-ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఒకటి రెండు చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా, మరే ఇతర అవాంఛనీయ ఘటనలూ లేకుండా రెండు గంటల పాటు పోలింగ్ సాగింది.

- నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది.  పోలింగ్ స్టార్ట్‌కాకముందే.. కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూ లైన్లలో నిల్చొని ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. 

- ఓటు హక్కు వినియోగించుకున్న వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు


మరింత సమాచారం తెలుసుకోండి: