ముఖ్యమంత్రి చంద్రబాబున నడిరోడ్డుపై కాల్చిచంపినా పర్లేదంటూ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనానికి కారణమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించింది.

Image result for nandyal bypoll

        నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చి చంపాలన్నారు.. ఇంకోరోజు ఉరితీసినా పాపం లేదన్నారు.. ఇంకోరోజు ఆయన్ను దెయ్యంతో పోల్చారు.. ఈ వ్యాఖ్యలన్నింటినీ సీరియస్ గా తీసుకున్న టీడీపీ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే ఇక్కడ ఎలాంటి స్పందనా లేకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది.

Image result for nandyal bypoll

        టీడీపీ వినతిని పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం.. ముఖ్యమంత్రిపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తాయని తేల్చిచెప్పింది. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని అదికారులను ఆదేశించింది. దీంతో జగన్ పై చర్యలు తీసుకోవడం ఖాయమైంది. అయితే ఎలాంటి చర్యలు ఉంటాయనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: