నంద్యాల ఉప ఎన్నిక రసవత్తరంగా జరుగుతున్న తరుణం లో అనుకోని అపశ్రుతి జరిగింది . పూలూరు లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లో అధికారిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కి కొద్దిసేపటి క్రితం గుండెపోటు వచ్చింది.


ఎన్నికల విధుల్లో భాగంగా పూలూరు వచ్చిన శ్రీనివాస రెడ్డి పోలింగ్ మొదలైన గంటలోనే సడన్ గా కింద పడిపోయారు.వెంటనే అక్కడ ఉన్న పోలీసులు, ఎన్నికల సిబ్బందీ అప్రమత్తమయ్యి ఆయన్ని స్థానిక ఆస్పత్రి కి తరలించారు.


ప్రస్తుతం శ్రీనివాస్ కి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. శ్రీనివాసరెడ్డి స్థానంలో మరో పోలింగ్ ఆఫీసర్ ను నియమించనున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల నిమిత్తం 1600 మంది సిబ్బంది, 2,500 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు.


మరొక పక్క నంద్యాల ఉప ఎన్నిక లో వైకాపా తరఫున బరిలోకి దిగిన శిల్పా మోహన్ రెడ్డి తన ఓటు హక్కు ని వినియోగించుకున్నారు. స్థానిక సంజీవ్ నగర్ లోని బూత్ నెంబర్ 81 లో ఆయన ఓటు వేసారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అందరూ కలిసి బూత్ కి రావడం విశేషం. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది అన్నారు ఆయన. ఆయనతో పాటు ఆయన కొడుకు కోడలు కూడా ఓటుహక్కు వినియోగించుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: