చిన్న చిన్న ఇబ్బందులు పక్కన పెడితే నంద్యలా ఉప ఎన్నికలు ప్రస్తుతం వరకూ చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. తొమ్మిది గంటల వరకూ 17 శాతం పోలింగ్ పూర్తి అవ్వగా ప్రస్తుతం ముప్పై శాతం వరకూ పోలింగ్ పూర్తి అయ్యింది.


మహిళా ఓటర్లు , యువత ఎక్కువగా పోలింగ్ బూత్ ల దగ్గర కనపడుతూ ఉన్నారు. బూత్‌ నంబర్ 152లో  సరిగా వెలుతురు లేకపోవడంతో .....ఓటర్లు ఇబ్బంది పడుతున్నారు. మొత్త్తం 255 పోలింగ్ బూత్ లలో ఓటింగ్ సాగుతోంది .


కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని గుర్తించిన ఈసీ అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరొక పక్క ఓటర్లు అందరికీ వైకాపా వారు ప్రత్యెక ఆదేశాలు ఇచ్చారు.


ఓటర్లని ప్రలోభాలకి గురి చేసే చర్యలు జరుగుతున్నాయి అని ఫీల్ అవుతున్న వైకాపా అలాంటివి జరిగితే వెంటనే తమకి ఫోన్ చెయ్యాలి అని చెబుతోంది. 7981230095, 7981429455 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని... తాము వెంటనే ఈ విషయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: