దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్న నంద్యాల ఉప ఎన్నిక ప్రశాంతంగా జరుగుతోంది. ఈ ఎన్నికకి సంబంధించి కీలకమైన పోలింగ్ ఘట్టం మీద ఈసీ పూర్తిగా దృష్టి పెట్టింది. ఇవాళ సాయంత్రం వరకూ పోలింగ్ జరగబోతోంది.


ఎన్నికల కోడ్ అమలు లో ఉన్న ఈ టైం లో అందరు ప్రజా ప్రతినిధులూ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రమే చంద్రబాబు పెట్టిన ప్రెస్ మీట్ కి సంబంధించి విమర్శలు వినపడుతూ ఉన్నాయి. సరిగ్గా తెల్లారితే పోలింగ్ అనగా ఇవాళ సాయంత్రమే చంద్రబాబు నాయుడు స్పెషల్ ప్రెస్ మీట్ ని పెట్టి ఉప ఎన్నిక కి సంబంధించి సర్వే ఫలితాలు చెప్పడం కోడ్ ఉల్లంఘన లోకి వస్తుంది అంటున్నారు విశ్లేషకులు.


ప్రతిపక్ష నేత మీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ జగన్ ని ఏకి పారేయడం వరకూ ఇబ్బంది లేని విషయమే కానీ సర్వే ఫలితాలు సరిగ్గా కోడ్ ఉన్న టైం లో మాట్లాడడం పట్ల సర్వత్రా సీరియస్ మాటలు వినపడుతున్నాయి.


 ఆయన వెల్లడించిన సర్వే ఫలితాలు నంద్యాల ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ మీడియా ఛానల్స్ వారు ఆ ప్రెస్ మీట్ ని సాయంత్రం లైవ్ టెలీకాస్ట్ చెయ్యడం తో పాటు ఉదయం పూట కూడా మళ్ళీ టెలీకాస్ట్ చేసారు ఈ రకంగా ఇది నంద్యాల ఓటర్లని ప్రభావితం చేసేలా ఉంది అంటున్నారు. సీఎం స్థాయి లో ఉన్న వ్యక్తి ఒకే ఒక్క రోజు ఆగి ఈమాటలు తన ప్రెస్ మీట్ లో చెబితే చాలా బాగుండేది అంటున్నారు. ఏదేమైనా కొన్ని గంటల ముందర చంద్రబాబు సీఎం స్థానం లో ఉండి మరీ కోడ్ ని ఉల్లంఘించారు అనే మాట వినపడుతోంది. మరి ఈ విషయం లో ఈసీ చర్యలు ఉంటాయో లేదో చూడాలి !

మరింత సమాచారం తెలుసుకోండి: