ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా నంద్యాల ప్రజలు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది..ఈ రోజు ఉదయం నుంచి నంద్యాలలో ఉప ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతుంది.  ఇప్పటికే 50 శాతం వరకు పూర్తయ్యింది. తాజాగా నంద్యాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఇతర ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు నంద్యాలలో మకాం వేశారంటూ వైసీపీ నేతలు ఎన్నికల అధికారి భన్వర్ లాల్ కు ఫిర్యాదు చేశారు.

సెయింట్ జోసెఫ్ హైస్కూల్  పోలింగ్ బూత్ లోకి భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె మౌనికారెడ్డి తమ అనుచరులతో కలిసి వెళ్లారు. ఈ నేపథ్యంలో భూమా అనుచరులను పోలీసులు బయటకు పంపారు. దీంతో, పోలీసులతో మౌనికారెడ్డి, అనుచరులు వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. స్థానికేతరులు జిల్లాలో ఉండొద్దని ఈసీ ఆదేశించినా పట్టించుకోని వైనం, యథేచ్చగా ఓటర్లపై ఒత్తిడులు, ప్రలోభాలకు  అధికార పార్టీ గురి చేస్తున్నారని వారు ఆరోపించారు.  

టీడీపీ అభ్యర్ధి భూమా బ్రహ్మనంద రెడ్డి సోదరి మౌనిక.. బూత్ నెంబర్ 55, 56, 57లోకి వెళ్లి, ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రవర్తించారని ఆరోపించారు. సీఈసీ నోటీసులు 21న ఇస్తే, ఓటర్లపై ప్రభావం చూపేలా పోలింగ్ రోజు ఎలా విడుదల చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: