నంద్యాలలో ఉపఎన్నికలో పోలింగ్ ముగిసే సమయం దగ్గరపడింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 71.91 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ అధికారికంగా ప్రకటించింది. అదే 4 గంటల సమయానికి 80శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు అనధికార సమాచారం. మరోవైపు.. సాయంత్రం 6లోపు వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేందుకు పార్టీల నేతలు ప్రయత్నిస్తున్నారు.

Image result for nandyal bypoll ec

నంద్యాల రూరల్ లో 81 శాతం పైగా పోలింగ నమోదైనట్టు తెలుస్తోంది. అదే నంద్యాల అర్బన్ లో 70 శాతం పోలింగ్ నమోదైనట్టు సమాచారం. ఇదే ట్రెండ్ కొనసాగితే పోలింగ్ ముగిసే సమయానికి 85 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. అంతేకాక పురుషులతో పోల్చితే మహిళల ఓటింగ్ భారీగా నమోదవడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: